Chiranjeevi And Ramcharan : ‘ఆచార్య’తో దిష్టి అలా పోయిందా.?

NQ Staff - December 3, 2022 / 01:15 PM IST

Chiranjeevi And Ramcharan  : ‘ఆచార్య’తో దిష్టి అలా పోయిందా.?

Chiranjeevi And Ramcharan  : మెగాస్టార్ చిరంజీవికీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కీ ‘ఆచార్య’ సినిమాతో దిష్టిపోయిందట. అలాగని మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లేస్తున్నారు.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ పురస్కారం దక్కిన విషయం విదితమే. ఎన్డీటీవీ ట్రూ లెజెండ్ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా పురస్కారాన్ని నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అందించింది.

Chiranjeevi And Ramcharan Won Most Prestigious Awards This Year

Chiranjeevi And Ramcharan Won Most Prestigious Awards This Year

మొన్నీమధ్యనే చిరంజీవి.. ఇప్పుడు రామ్ చరణ్..

ఇటీవల చిరంజీవి ‘ఇండియన్ సినిమా పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని దక్కించుకున్నారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు చిరంజీవి.
అటు తండ్రి, ఇటు తనయుడు.. వెరసి, మెగా కుటుంబంలో ఇద్దరు నటులకు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు ఈ ఏడాది దక్కాయి.

Chiranjeevi And Ramcharan Won Most Prestigious Awards This Year

Chiranjeevi And Ramcharan Won Most Prestigious Awards This Year

ఈ ఏడాది చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ దక్కించుకుంటే, ‘ఆచార్య’ సినిమాతో చిరంజీవి, చరణ్.. ఇద్దరూ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ సక్సెస్‌తో ఊపిరి పీల్చుకున్నారనుకోండి.. అది వేరే సంగతి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us