Chiranjeevi : తమ్ముడు తెలివిగా ఆలోచిస్తున్నాడు.! అన్నయ్య చిరంజీవి మేలుకుంటాడా.?

NQ Staff - December 4, 2022 / 10:17 AM IST

Chiranjeevi : తమ్ముడు తెలివిగా ఆలోచిస్తున్నాడు.! అన్నయ్య చిరంజీవి మేలుకుంటాడా.?

Chiranjeevi : అభిమానులే దర్శకులైతే.? ఆ హీరో తెరపై చూపించే హీరోయిజం వేరే లెవల్‌లో వుంటుంది.! ఈ విషయం ‘విక్రమ్’ లాంటి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. కానీ, అన్ని సందర్భాల్లోనూ అలా జరుగుతుందా.? రజనీకాంత్ విషయంలో అలా జరగడంలేదు కదా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులైన హరీష్ శంకర్, సుజీత్ లాంటి దర్శకులతో సినిమాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా అనౌన్స్ అయ్యాక, ‘చిరంజీవి కూడా ఇలా ఆలోచిస్తే మంచిది..’ అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

ఆ విషయంలో చిరంజీవే ముందు..

అసలు చిరంజీవికి వీరాభిమానులు కానివారెవరు.? ఓ జనరేషన్‌ని తన అభిమానులుగా మార్చేసుకున్న మెగాస్టార్ ఆయన. వినాయక్, చిరంజీవికి వీరాభిమాని. కొరటాల శివ సైతం, చిరంజీవికి వీరాభిమాని. కానీ, ఏం జరిగింది.? ‘ఆచార్య’ సినిమా వచ్చింది కొరటాల శివ నుంచి.

చిరంజీవి సినిమాకి దర్శకత్వం వహించాలన్నది తన డ్రీమ్.. అని చెప్పుకునే పూరి జగన్నాథ్ లైన్‌లో వున్నాడు. అన్నట్టు, మెహర్ రమేష్ కూడా చిరంజీవికి వీరాభిమాని. అయితే, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు చిరంజీవిపై విపరీతమైన అభిమానాన్ని కలిగి వుంటారు. అలాంటివారితో చిరంజీవి సినిమా చేయాలన్నది అభిమానుల కోరిక. చిరంజీవి ఆ దిశగా అడుగులేస్తారా.? వేచి చూడాల్సిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us