చినజీయర్ స్వామికి మాతృవియోగం

త్రిదండి చినజీయర్‌ స్వామి ఇంట్లో విషాదం నెలకొంది. అయితే చినజీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) కన్నుమూశారు. నిన్న రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఇక ఆమె అంత్యక్రియలు ఈ రోజు శంషాబాద్‌ ఆశ్రమం దగ్గర జరగనున్నాయి. అయితే గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. దీనితో ఆమె ఆరోగ్యం మరింత క్షిణించడంతో మరణించారు.

ఇక మాతృమూర్తి మరణించడంతో చినజీయర్‌ స్వామి, తన కుటుంబం విషాదంలో మునిగిపోయారు. తల్లి మంగతాయారు మరణం తట్టుకోలేకపోతున్న అని చినజీయర్‌ స్వామి.. తల్లితో ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసుకొని కన్నీరు మున్నీరయ్యారు.