Chinmayi Sripada: పిల్ల‌ల్ని ఎప్పుడు క‌నాల‌నేది మా ఇష్టం.. మంత్రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చిన్మ‌యి

Chinmayi Sripada: సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈవిడ మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌పై ధీటుగా స్పందిస్తూ ఉంటుంది. మ‌హిళ‌ల‌ను ఎవ‌రైన త‌క్కువ చేసి మాట్లాడితే వెంట‌నే త‌న‌దైన శైలిలో స్పందిస్తూ వార్త‌ల‌లోకి ఎక్కుతుంది. తాజాగా చిన్మయి కర్ణాటక మంత్రి వ్యాఖ్యలపై మండి పడింది.

Chinmayi Sripada Counter to Karnataka Minister
Chinmayi Sripada Counter to Karnataka Minister

రీసెంట్‌గా క‌ర్ణాట‌క మంత్రి.. ‘ఇప్పుడు మహిళలు ఒంటరిగా బతుకుతున్నారు. పేరెంట్స్‌ను వదిలేస్తున్నారు. వారి అవసరం లేకుండా ఉంటున్నారు. ఒకవేళ అమ్మాయిలు పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కనడం లేదు.. ఇలాంటి ఆలోచనలు మహిళల్లో వచ్చేశాయి. అది చాలా తప్పు’ అని మంత్రి మాట్లాడాడు. అయితే దీనిపై చిన్మయి తన స్టైల్లో కౌంటర్లు వదిలింది.

Chinmayi Sripada Counter to Karnataka Minister
Chinmayi Sripada Counter to Karnataka Minister

ఈ కాలంలోని అమ్మాయిలకు ఏం చేయాలో ఏం చేయకూడదో క్లియర్‌గా తెలుసు.. వారి హద్దులు వారు గీసుకుంటున్నారు. పిల్లలేమీ తల్లిదండ్రుల సొంతం కాదు. ఎంతో మంది త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ని ఇబ్బందులు పెడుతున్నారు. భారత మహిళలు సింగిల్‌గా ఉంటూ.. తమ సంతోషాన్ని తాము వెతుక్కుంటున్నారంటే.. ఆ మార్పు వచ్చిందంటే ఎంతో మంచిది. ఎప్పుడు పిల్లల్ని కనాలి? ఎప్పుడు జన్మనివ్వాలి అనేది కూడా మా ఇష్టం. అది మా హక్కు.

మగాడు మాత్రం కేవలం తన వీర్యాన్ని ఇచ్చి అండాలు అభివృద్ది చెందేందుకు తోడ్పడుతాడంతే. అయితే తమ అల్లుళ్ల వీర్య కణాలు వృద్ది చెందేందుకు అమ్మాయిల తల్లిదండ్రులు లక్షల్లో ఖర్చు పెడుతున్నారట. ఎంతో మంది తల్లిదండ్రులు ఇంకా పాత పద్దతులనే పాటిస్తున్నారు.. కులాల కోసం కొట్లాడుకుంటూనే ఉంటున్నారు. ఇంకా ఎన్నెన్నో సమస్యలున్నాయి అయితే తల్లిదండ్రులు పెట్టే హింసను జీవితాంతం భరించాల్సిన అవసరం లేదు’ అని చిన్మయి చెప్పుకొచ్చింది