Chinese Government : అమ్మాయిల లో దుస్తులకు ఇకపై అబ్బాయిలు బ్రాండ్ అంబాసిడర్స్
NQ Staff - March 4, 2023 / 08:00 PM IST

Chinese Government : చైనా ప్రభుత్వం ఆడవారు లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించడం నిషేదించారు. దాంతో ఆడవారి లో దుస్తుల యొక్క బ్రాండ్ అంబాసిడర్స్ గా కూడా మొగవాళ్లు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇదే అక్కడ ఫ్యాషన్ అయ్యింది. మొదట్లో మగవారు కాస్త ఇబ్బంది పడ్డా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక ఓకే చెప్తున్నారు.
గడ్డం మరియు మీసాలు ఉన్న మగవారు ఆడవారి యొక్క లో దుస్తులు ధరించి ఫొటోలకు ఫోజ్ లు ఇవ్వడం.. ఆ ఫొటోలు వైరల్ అవ్వడం జరుగుతోంది. కొందరు మగవారు తమ గడ్డం మరియు మీసాలను కనిపించకుండా మాస్క్ ధరిస్తే.. మరి కొందరు మాత్రం తమ ఫేస్ ను బయటి వారు గుర్తించకుండా మాస్క్ లు ధరిస్తున్నారు. మొత్తానికి మగవారు తాము ఏం తక్కువ కాదు అని లో దుస్తులతో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
చైనాకు చెందిన అమ్మాయిలు లో దుస్తుల యాడ్స్ లో నటించడం వల్ల అశ్లీలత ఎక్కువ అవుతుందని ప్రభుత్వం భావించిందట. అందుకే లో దుస్తులను ప్రమోట్ చేసేందుకు ఆడవారికి పర్మీషన్ ను తొలగించారు. మగవారు ఎలా కనిపించినా ఏం పర్వాలేదు అన్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఆడవారిపై మరిన్ని ఆంక్షలు అమలు చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.