భారత్ తన తప్పును సరిదిద్దుకోవాలి : చైనా

Advertisement

భద్రతాపరమైన కారణాల వల్ల దేశంలో కొన్ని చైనా యాప్స్ ను భారత్ నిషేధించింది. కొన్ని నెలల క్రితం టిక్ టాక్ తో సహా మరో 59 చైనా యాప్స్ ను నిషేధించింది. నిన్న తాజాగా పబ్ జీ తో సహా మరో 118 యాప్స్ ను నిషేధిస్తున్నట్టు భారత ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం పై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. చైనా కంపెనీల పట్ల వివక్షతతో, కక్ష పూరితమైన చర్యలకు భారత్ పాల్పడిందని, కక్ష సాధించడానికి భారత్ దేశ భద్రత అనే అంశాన్ని దుర్వినియోగం చేస్తుందని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ వ్యాఖ్యానించారు.

భారత్ తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చైనా అధికారులు భారత్ ను కోరారు. విదేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న చైనా కంపెనీలకు అంతర్జాతీయ వ్యాపార నియమాలను, చట్టాలను పాటించే విధంగా చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గావో ఫెంగ్ తెలిపారు. భారత్ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు అంతర్జాతీయ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని చైనా అధికారులు తెలిపారు. చైనా యాప్స్ నిషేదంతో భారత్ పై చైనా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here