ఆర్టికల్ 370ని రద్దు చేయడం చట్టవిరుద్ధం: చైనా

Advertisement

ఢిల్లీ: ఆగస్ట్ 5నాటికి జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కలిపించే ఆర్టికల్ 370ను రద్దు చేసి సంవత్సరం అయ్యింది. ఈ విషయం పై చైనీస్ స్పోక్స్ పర్సన్ వ్యంగ్ వెనబిన్ స్పందిస్తూ…ఏక పక్షమైన ఏ నిర్ణమైన అనైతికమని, అలాగే ఆర్టికల్ 370 విషయంలో కూడా భారత్ చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్, ఇండియా పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్యను రెండు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని, యునైటెడ్ నేషన్స్ సెక్యురిటి కౌన్సిల్ నిబంధనల ప్రకారం చర్చించుకోవలని సూచించారు.

దీని పై ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ అనురాగ్ శ్రీనివాస్ స్పందిస్తూ… ఇండియా-పాకిస్థాన్ వివాదంలో జోక్యం చేసుకోవడానికి చైనా ఎలాంటి సంబంధం లేదని, మొదటి నుండి చైనా ఆర్టికల్ 370 రద్దు పై వ్యతిరికంగానే ఉందని స్పష్టం చేసింది. తాజాగా చైనా ఇండియా మధ్యన కూడా సరిహద్దుల దగ్గర జరుగుతున్న గొడవల కారణంగా దేశ భద్రత దృశ్య భారత ప్రభుత్వం చైనా యాప్స్ ను తొలగించిన విషయం తెలిసందే. ఇప్పుడు అమెరికా కూడా చైనా యాప్ అయిన టిక్ టాక్ ను నిషేధించడానికి ప్రయత్నాలు చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here