Pangolins : అడవి అలుగు@రూ.20 లక్షలు.. చైనాలో భారీ డిమాండ్‌

NQ Staff - September 25, 2022 / 09:59 AM IST

Pangolins : అడవి అలుగు@రూ.20 లక్షలు.. చైనాలో భారీ డిమాండ్‌

Pangolins : ఇటీవల ఏలూరు జిల్లా పరిధిలోని పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అడవి అలుగుల యొక్క జాడ స్థానికులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులు వీటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ సమయంలోనే సోషల్ మీడియాలో అడవి అలుగు ల యొక్క విశిష్టత మరియు వాటి యొక్క డిమాండ్ గురించి వైరల్ అవుతుంది.

ఇక ఈ అడవి అలుగు యొక్క విశిష్టతను గురించి ఇప్పుడు చూద్దాం.. వీటికి పగలు కంటే రాత్రి సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందట.. అందుకే రాత్రి సమయంలోనే ఇవి ఎక్కువగా సంచరిస్తాయి. దగ్గర పట్ల ఏదైనా అలికిడి అయితే అవి బెదిరి వెంటనే కదలకుండా గుండ్రంగా బంతి మాదిరిగా ముడుచుకు పోతాయి.

అడవి అలుగు ని సింహం పులి వంటి అత్యంత బలమైన క్రూర మృగాలు కూడా వేటాడలేవు, కారణం అడవి అలుగు శరీరంపై ఉండే బలమైన పెంకులు.. అవును ఈ బలమైన పెంకులు కారణంగానే సింహం మరియు పులి కూడా వీటిని వేటాడలేవు అంటూ వన్యప్రాణ సంరక్షకులు చెప్తున్నారు.

ఈ అడవి అలుగు శరీరంపై ఉండే పెంకులే చైనాలో అత్యంత ఖరీదైన ఔషధానికి ఉపయోగించే ముడి సరుకులుగా చెబుతున్నారు. అందుకే వీటికి భారీ డిమాండ్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రసారం జరుగుతోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us