China: బ్యాంకులో మాస్క్ పెట్టుకోమ‌న్నందుకు చుక్క‌లు చూపించాడుగా..!

China: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వైర‌స్ వ‌ల‌న ప్ర‌తి ఒక్క‌రు నిద్ర‌లేని రాత్రులు గడుపుతున్నారు. క‌రోనా బారి నుండి త‌ప్పించుకోవాలి అంటే మాస్క్‌తో పాటు శానిటైజేష‌న్ త‌ప్ప‌నిస‌రి చేసుకోవ‌ల‌సి ఉంది.

China
మాస్క్‌ లేనివారిని జన సంచారమున్న ప్రాంతంలో, మాల్స్‌లో, బ్యాంకుల్లో కూడా అనుమతించడం లేదు. తాజాగా ఓ మిలియనీర్‌ మాస్కు పెట్టుకోకుండా బ్యాంకుకు వెళ్లాడు.దాంతో సెక్యూరిటీ గార్డ్ మాస్క్ లేక‌పోతే అనుమ‌తించ‌మ‌ని అన్నాడు. దీంతో ఆ మిలియ‌నీర్ చేసిన ప‌ని అంద‌రికి షాకింగ్‌గా మారింది.

చైనాలోని బ్యాంక్ ఆఫ్‌ షాంఘైలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ప్ర‌కారం సెక్యూరిటీ గార్డు చెప్పిన విధానం నచ్చలేదో, లేదా అతని ప్రవర్తన నచ్చలేదో గానీ ఆ వ్యక్తి తన ఖాతాలోని డబ్బులన్నీ విత్‌ డ్రా చేసేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే నిబంధనల ప్రకారం.. ఒక రోజుకు 5 మిలియన్ల యువాన్‌లు (భారత కరెన్సీ ప్రకారం 5.8 కోట్లు) మాత్రమే బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకునే పరిమితి ఉంది.

సొమ్మును ఒకేసారి విత్‌ డ్రా చేశాడు ఆ బిలియనర్‌. ఇదిలా ఉంటే ఒకే కరెన్సీ కౌంటర్‌తో అంత పెద్ద మొత్తాన్ని లెక్కపెట్టడానికి బ్యాంకు సిబ్బందికి రెండు గంటలపైగా పట్టిందట. అంతటి ఆగకుండా తన ఖాతాలో డబ్బు మొత్తం విత్‌ డ్రా చేసే వరకూ ప్రతిరోజూ ఇదే సీను రిపీట్‌ అవుతుందని ఆ మిలియనీర్‌ చెప్పాడట. ప్రస్తుతం ఆ వ్యక్తి డబ్బులు ఉన్న సూట్‌కేసులను తన లగ్జరీ కారులో తీసుకెళ్తున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.