China : సరిహద్దు వెంట అత్యాధునిక డ్రోన్లు.. ఫైటర్ జెట్ పెట్టిన చైనా
NQ Staff - December 19, 2022 / 10:32 PM IST

China : భారత్ చైనా మధ్య ఎప్పుడు సరిహద్దు విభాగం కొనసాగుతూనే ఉంది. భారత్ చర్చలతో వివాదం సర్దుమనగాలని చూస్తూ ఉంటే చైనా మాత్రం దాన్ని అలుసుగా తీసుకొని దూసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
డిసెంబర్ 9వ తారీఖున భారత్ మరియు చైనా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుండి మళ్లీ బోర్డర్ లో యుద్ధ వాతావరణం కమ్ముకుంది.
ముఖ్యంగా చైనా టిబెట్ లోని బాండా, లాసా ఇంకా ఇతర వైమానిక స్థావరంలో పెద్ద ఎత్తున యుద్ధ విమానాలు మరియు అత్యాధునిక డ్రోన్లను మోహరించిందట. ఈ విషయం చైనా సైనికుల ద్వారా ఇండియాలో తెలిసిందట.
విషయం ఎలా తెలిసినా కూడా ప్రస్తుతం చైనా యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తుంది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ప్రపంచంలో యుద్ధం వల్ల కలిగే నష్టమేంటో అనుభవం లోకి వచ్చింది.
ఈ సమయంలో చైనా మళ్ళీ యుద్ధ సన్నాహాలు చేస్తుందని వార్తలు ప్రపంచ దేశాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఈ వ్యవహారంను చైనా ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. చైనాకు గట్టి సమాధానం ఇచ్చేందుకు ఎప్పుడూ కూడా భారత్ సిద్ధంగానే ఉందని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.