China Covid : ఆ నగరంలో వందలో 70 మంది కరోనా పేషంట్స్
NQ Staff - January 3, 2023 / 10:34 PM IST

China Covid : కరోనా పుట్టింది ఎక్కడ.. ప్రపంచ వ్యాప్తంగా అది ఎలా విస్తరించింది అంటే చాలా మంది చెప్పే సమాధానం చేయను చైనా. వారి యొక్క ఆహారపు అలవాట్ల కారణంగానే కరోనా వైరస్ పుట్టిందని ఇప్పటికి చాలా మంది వాదిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనాతో భయాందోళనకు గురవుతున్న సమయంలో చైనా మాత్రం చాలా సైలెంట్ గా, ఏం తెలియనట్లు.. ఏం జరగనట్లు ఉంది. కానీ ఇప్పుడు చైనాలో కరోనా కేసులో విపరీతంగా నమోదవుతున్నాయి.
డిసెంబర్ నెలలో జీరో కోవిడ్ పాలసీని చైనా ప్రభుత్వం ఎత్తి వేయడంతో అప్పటి నుండి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా కేసులతో పాటు దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది.
అంతర్జాతీయ మీడియా సంస్థల కథనం ప్రకారం చైనాలోని షాంఘై నగరంలో నూటికి 70 మందికి ఇప్పటికే కరోనా సోకిందట. ఈ నెల రోజుల్లోనే భారీ ఎత్తున కరోనా కేసులు నమోదు అవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా చైనాలో ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంది.
షాంఘై లో ఉన్న 2.5 కోట్ల మంది ప్రజల్లో ఇప్పటికే 70 శాతం మందికి కోవిడ్ సోకిందని.. ప్రస్తుతం కూడా లక్షలాది మంది కోవిడ్ తో బాధపడుతున్నారని తెలుస్తోంది. చైనా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. అది ఇతర దేశాలకు విస్తరించడానికి ఎక్కువ సమయం పట్టక పోవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.