చైనాకు మరో దెబ్బ..! యాపిల్ సంస్థ నుండి 4 వేలకు పైగా యాప్ లను తొలగింపు

Advertisement

చైనా దేశానికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తాజాగా భారత్ ఇచ్చిన షాక్ కు కోలుకోముందే… మల్లి ఓ ఎదురు దెబ్బ తగిలింది చైనాకు. స్మార్ట్ ఫోన్ రంగంలో దిగ్గజం అయిన ఆపిల్ సంస్థ చైనా కు పెద్ద షాక్ ఇచ్చింది. ఆపిల్ సంస్థ ఇచ్చిన షాక్ కు చైనా ఇప్పట్లో కోలుకోవడం కష్టమే.

ఎందుకంటె చైనాకు చెందిన నాలుగు వేల ఐదు వందల మొబైల్ గేమ్స్ ను చైనా యాప్ స్టోర్ నుండి తోలిగించింది ఆపిల్ సంస్థ. దీనితో దిక్కుతోచని ఆందోళనలో ఉన్నాయి చైనా కి చెందిన సంస్థలు. రానున్న రోజుల్లో చైనా సంస్థలకు చెందిన యాప్స్ ను వేరే దేశాలు కూడా నిషేధించే ఆలోచనలో ఉన్నాయి.

భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన వివాదం నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనా కు చెందిన 59 యాప్స్ ను భారత్ లో నిషేదించింది. అంతేకాకుండా భారత్ లో కోట్లాది సంఖ్యలో యూజర్స్ ఉన్న టిక్ టాక్ యాప్ ని కూడా నిషేధించడం తో చైనాకు భారీ నష్టం అనే చెప్పుకోవచ్చు. అంతేకాదు భారత్ తీసుకున్న నిర్ణయాన్నీ అమెరికా వంటి దేశాలు కూడా సమర్ధించాయి. దీనితో ఆర్థికంగా చైనాకు చాల నష్టం వాటిల్లింది.

ఇది ఇలా ఉండగానే దిగ్గజ సంస్థ అయిన యాపిల్ సంస్థ కూడా చైనాకు భారీ షాక్ ఇచ్చింది. చైనా యాప్ స్టోర్ కు చెందిన నాలుగు వేల ఐదు వందల మొబైల్ గేమ్స్ ను ఆపిల్ సంస్థ తొలిగించింది. దింతో దిక్కులేని స్థితిలో ఉంది చైనా. దీనికి కారణం చట్ట పరంగా ఏలాంటి అనుమతులు లేకుండా తమ సంస్థలో ఉంచుతున్నట్టు ఆపిల్ ఆరోపిస్తుంది.

ఒకవైపు ఆపిల్ సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో చేపట్టిన మార్పుల వల్ల చైనా యాప్స్ ని తొలగిస్తున్నట్టు తెలుస్తుంది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకపోతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఆపిల్ సంస్థ ఇంతక ముందే చైనాకు హెచ్చరించమని చెప్పింది.

గతంలో విధించిన గడువు జూన్ 30 న పూర్తయినందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆపిల్ సంస్థ స్పష్టం చేసింది . అలాగే ఆపిల్ సంస్థలో ని నిబంధనలను రెన్యూవల్ చేసుకుంటేనే తిరిగి మల్లి యాప్స్ ని అప్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే మొన్న భారత్ నిషేదించిన యాప్స్ మరియు ఇప్పుడు ఆపిల్ సంస్థ నిషేదించిన గేమ్స్ తో చైనా భారీ నష్టాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు ఈ యాప్స్ నిషేధం వలన చైనాకు వచ్చిన నష్టం ఏకంగా అరవై నుండి 70 వేల కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు నిపుణులు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here