మరోసారి సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తున్న చైనా

Advertisement

చూస్తుంటే చైనా కూడా పాకిస్థాన్ లా మారనుంది. పాకిస్థాన్ కూడా చేసుకున్న ఒప్పందాలను తరచూ ఉల్లంఘిస్తూ ఉంటుంది. గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను మరోసారి చైనా తుంగలో తొక్కింది. పాంగాంగ్‌ సో సరస్సు వద్ద గల వాస్తవాధీన రేఖ వెంట సైనిక కార్యకలాపాల్ని మళ్లీ ప్రారంభించింది. ఏకపక్షంగా సరిహద్దుల్ని మార్చడానికి ప్రయత్నిస్తూ భారత సైన్యాన్ని రెచ్చగొట్టేందుకు యత్నించిందని సైనిక వర్గాలు తెలిపాయి. చైనా కుట్రలను ముందుగానే పసిగట్టిన మన బలగాలు వారి దుశ్చర్యలను దీటుగా తిప్పికొట్టినట్లు వెల్లడించాయి.

చర్చల ద్వారా వివాదాల్ని పరిష్కరించుకునేందుకే తాము మొగ్గుచూపుతామని భారత సైన్యం పునరుద్ఘాటించింది. అదే సమయంలో ప్రాదేశిక సమగ్రతను కాపాడే విషయంలో మాత్రం రాజీపడబోమని స్పష్టం చేసింది. తాజా వివాదాల్ని పరిష్కరించుకునేందుకు చుశుల్‌ ప్రాంతంలో ప్రస్తుతం చర్చలు ప్రారంభమైనట్లు తెలిపింది. ఆగస్టు 29-30 మధ్యరాత్రి ఈ ఘటన జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here