నూతన కుట్రకు తెరలేపిన చైనా!

Advertisement

సరిహద్దు ఒప్పందాలను తరచూ అతిక్రమిస్తూ కుట్రలకు పాల్పడుతున్న చైనా తాజాగా మరో కుట్రకు తెర తీసిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భారత్‌లోని ప్రముఖులపై చైనా నిఘా వేసిందంటూ ప్రముఖ జాతీయ పత్రిక ప్రచురించిన ఓ కథనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రముఖుల లిస్ట్ లో ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్ ల వరకు ఉన్నారని కథనంలో వెల్లడించింది.

ఈ అంశంపై కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అఠవాలే స్పందించారు. భారత్‌ కూడా చైనా పై ఓ కన్నేసి ఉంచిందని.. త్వరలోనే ఆ దేశానికి ఓ గుణపాఠం నేర్పుతామని వ్యాఖ్యానించారు. దేశంలో దాదాపు 10 వేల మందిపై చైనా రహస్యంగా నిఘా వేసింది. షెన్‌జెన్, ఝెన్హువా అనే ఐటీ సంస్థలు ‘ఓవర్సీస్‌ కీ ఇన్‌ఫర్మేషన్‌ డేటాబేస్‌’ పేరిట ‘హైబ్రిడ్‌ వార్‌ఫేర్‌’ అనే కార్యాన్ని శ్రీకారం చుట్టాయని, ప్రముఖుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి ఆన్‌లైన్‌ కార్యకలాపాల్ని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తున్నాయని పత్రిక వెల్లడించింది. ఈ విషయంపై దేశ భద్రతా అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here