చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్లు

Advertisement

పిల్లలు ఎక్కువగా బిస్కెట్లు తింటారు. ఇదే తరుణంలో బిస్కెట్లు తిని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషయంగా ఉంది. వివరాల్లోకి వెళితే ఏపీ కర్నూలు జిల్లాలోని చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే చింతకొమ్ముదిన్నె గ్రామానికి చెందిన మాబు వద్ద ఆయన మనవడు, మనవరాళ్లు హుస్సేన్‌భాష, జమాల్‌బీ, హుస్సేన్‌బీ డబ్బులు తీసుకుని దగ్గరలో ఉన్న ఓ షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొని తెచ్చుకున్నారు.

ఇక ఆ బిస్కెట్లను ముగ్గురు పిలల్లు తలా కొన్ని తిన్నారు. అయితే తిన్న కొద్దిసేపటికే వారికి కడుపనొప్పి మొదలైంది. ఈ విషయాన్ని ఆ పిల్లలు వాళ్ళ కుటుంబ పెద్దలకు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు వారిని వెంటనే ఆళ్లగడ్డలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హుస్సేన్ ‌భాష మృతిచెందాడు. ఇక మిగతా ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని కర్నూలులో ఓ ఆసుపత్రికి తరలించారు.

కాగా, చిన్నారులు కొనుగోలు చేసిన బిస్కట్ ప్యాకెట్ పై రోజ్ మ్యాంగో అనే పేరు ఉంది. చిన్నారులు బిస్కెట్‌లు తిన్న వెంటనే అస్వస్థతకు గురయ్యారని ఆహారం పూర్తిగా విషామైందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here