గణపతి మండపానికి అనుమతి ఇవ్వాలని బుడతలు ఎస్ ఐ కి అనుమతి పత్రం

Advertisement

కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ ఏడాది గణేష్ మండపాలకు, విగ్రహాలకు అనుమతి లేదని పోలీస్ అధికారులు తెలిపారు. అయితే ఒకవైపు నిబంధనలు పాటించి గణేష్ నవ రాత్రులు జరుపుకోవాలని గణేష్ ఉత్సవ కమిటీ హైదరాబాద్ వారు పిలుపునిచ్చారు. అయితే ఒకవైపు చాలా మంది యువకులు, చిన్న పిల్లలు అందరు కూడా గణేష్ పండగ విషయంలో నిరుత్సాహంగా ఉన్నారు. ప్రతి ఏడాది ప్రతి ఒక్కరు కూడా గణేష్ పండగను అంగరంగా వైభవంగా జరుపుకునే వారు. ఇక ఈ ఏడాది ఆంక్షలు విధించడంతో అయమేయం లో ఉన్నారు.

ఇదే తరుణంలో రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన చిన్నారులు గణేష్ పండగ మీద మక్కువతో వినూత్నంగా ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే తమకు గణేష్ విగ్రహాన్ని నిలుపుకోడానికి అనుమతి ఇవ్వాలని స్థానికి కేశంపేట ఎస్ ఐ కి అనుమతి పత్రాన్ని రాసారు. అంత చిన్న వయసు గల చిన్నారులు అనుమతి పత్రాన్ని రాసె సరికి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ చిన్నారుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here