Child Artist Kavya: గంగోత్రి సినిమా లో వల్లంకి పిట్ట పాట లో ఉన్న ఆ చిన్న పాప ఇప్పుడెలా ఉందో చూడండి

Child Artist Kavya: అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’లో ‘వల్లంకి పిట్ట’ పాటలో చిన్నప్పటి కథానాయికగా కనిపించిన కావ్య క‌ళ్యాణ్ రామ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ వస్తే కానీ అన్నం తినని, అల్లు అర్జున్ పాట పాడితే కాని నిద్రపోని పాత్ర‌లో కావ్య అద్భుతంగా న‌టించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చిన కావ్య ఎంతోమంది హీరోల సినిమాలలో నటించింది. చిరంజీవి ఠాగూర్, బాలకృష్ణ విజయేంద్ర వర్మ, పవన్ కళ్యాణ్ బాలు వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది.

 

చైల్డ్ ఆర్టిస్ట్‌గా అర‌డ‌జ‌ను సినిమాల‌లో న‌టించిన కావ్య తెలుగు, మలయాళ సినిమాలలో ఆడిషన్స్ ఇస్తుంది. త్వ‌ర‌లో క‌థానాయిక‌గా అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే అప్పుడప్పుడు ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది. అయితే చిన్న‌ప్పుడు కావ్య ఎలా ఉందో ఇప్పుడు అదే లుక్ లో క‌నిపిస్తుంది.

‘పుణెలోని లా పూర్తి చేసిన కావ్య‌, ఇప్పుడు సినిమాల వైపు దృష్టి పెట్టింది. ఈమె సినిమా ఎంట్రీకి లాక్‌డౌన్ కూడా కార‌ణం అని అంటున్నారు. రియాలిటీకి దగ్గరగా ఉండే, ఇంట్రెస్టింగ్‌, ఛాలెంజింగ్‌ పాత్రలంటే త‌నకు చాలా ఇష్టం అంటుంది కావ్య . ఓటీటీలో డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌ వస్తున్నాయి. అలాంటి అవకాశం నాకు వచ్చి, పాత్ర ఆసక్తిగా అనిపిస్తే చేస్తాను’’ అని ఇటీవ‌ల చెప్పింది కావ్య.

తాజాగా ఈ ముద్దుగుమ్మ సెలూన్‌కి వెళుతున్న స‌మ‌యంలో ఫొటోల‌కి ఫోజులిచ్చింది. కావ్య‌ని ఇలా చూసి అంతా షాక‌వుతున్నారు. రానున్న రోజుల‌లో ఈమెని వెండితెర‌పై చూసి ఆనందం పొందాల‌ని అభిమానులు భావిస్తున్నారు. వల్లంకి పిట్ట చిన్నారిగా మారిపోయిన కావ్య ప్ర‌స్తుతానికి అయితే సినిమాల క‌న్నా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ అల‌రిస్తుంది.