ధోని ఫేర్ వల్ మ్యాచ్ ను నిర్వహించాలని బీసీసీఐని కోరిన ముఖ్యమంత్రి

Advertisement

నిన్న సాయంత్రం 7:29నిమిషాలకు తాను ఇంటర్నేషల్ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని ప్రకటించడంతో క్రికెట్ నిరాశతో కృంగిపోయారు. నిన్న మొత్తం ధోనికి సంబంధించిన క్రికెట్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోని రిటైర్మెంట్ ప్రకటించడాన్ని చాలామంది ధోని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు ఫేర్ వెల్ ఘనంగా బీసీసీఐ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతుంది.

హేమంత్ ట్వీట్ లో” మేము ఇకపై జార్ఖండ్ కుర్రాడు మాహీని నీలిరంగు జెర్సీ ధరించి రావ‌డాన్ని చూడలేం. అయితే రాంచీలో మా మాహికి ఫెయిర్‌వెల్ మ్యాచ్ ఏర్పాటు చేస్తే, దానికి ప్రపంచం మొత్తం సాక్షిగా నిలుస్తుంది. అందుకే బీసీసీఐకి విన‌తి చేస్తున్నాను. మాహీ వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేస్తే జార్ఖండ్ ఆతిథ్యం ఇస్తుంద‌ని” ట్వీట్ చేశారు. దీన్ని ధోని అభిమానులు కుడా సమర్థిస్తూ షేర్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వినతిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here