కరోనా నుండి కోలుకున్న చెన్నై ఆటగాడు

Advertisement

కరోనా క్రికెటర్లను కూడా వెంటాడుతుంది. అయితే ఈ ఏడాది జరగవలిసిన ఐపీల్ యూఏఈ లో జరగనుంది. ఇప్పటికే అన్ని టీమ్ లు ఆ దేశానికి చేరుకున్నాయి. అయితే చెన్నై టీమ్ లో ఇద్దరు ఆటగాళ్ల దీపక్ చహార్, రుతురాజ్ గైక్వాడ్ లకు అలాగే మరో 11 మంది సిబ్బందికి కరోనా సోకింది. కానీ తాజాగా ఓ వీడియో ద్వారా తాను కరోనా నుండి కోలుకున్నాను అని దీపక్ చహార్ తెలిపాడు.

అయితే చెన్నై టీంలో పలువురికి కరోనా రావడంతో ఆ టీమ్ మెంబర్స్ అందరు కూడా క్వారంటైన్ లో ఉన్నారు. అయితే వారికి నిన్నటి రోజున చేసిన కరోనా పరీక్షల్లో టీం మొత్తానికి కూడా నెగెటివ్ వచ్చింది. అలాగే రేపు కూడా మరొక టెస్టు చేయనున్నారు. ఇక అందులో కూడా వారికి నెగెటివ్ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 4 నుండి ప్రాక్టీస్ ను ప్రారంభించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here