కరోనా భారిన పడ్డ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు

Advertisement

కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు కొన్ని నెలలుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ కరోనా నేపథ్యంలో ఐపీల్ ను దేశంలో నిర్వహించడం అసాధ్యమని భావించిన బీసీసీఐ ఐపీల్ ను యూఏఈలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే నెల 19న ఐపీల్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు ఐపీల్ అభిమానులకు కరోనా షాక్ ఇచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ లోని ఒక ఫాస్ట్ బౌలర్ కు, 12మంది చెన్నై సూపర్ కింగ్స్ స్టాఫ్ కరోనా భారిన పడ్డారు.

కరోనా భారిన పడ్డవారిని దుబాయ్ లోనే క్వారంటైన్ చేశారు.చెన్నై ఐదు రోజుల ట్రైనింగ్ సెక్షన్ పూర్తి అయిన తరువాత ఈనెల 21న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు యూఏఈకు బయలుదేరారు. కరోనా భారిన పడ్డ వారి ఆరోగ్య సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. చెన్నై ఆటగాళ్లు తమ 6 రోజుల క్వారంటైన్ పూర్తి అయిన కేసుల ఇంకా తమ ప్రాక్టీస్ ను ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో కరోనా చెన్నై ఆటగాళ్లలో కలకలం రేపింది. ఈ కరోనా వల్ల ఐపీల్ జరుగుతుందో లేదో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here