చెన్నై టీం లో ఏ ప్లేయర్ కి కరోనా వచ్చిందో తెలిసిపోయింది

Advertisement

కరోనా దృష్ట్యా ఈ ఏడాది జరగవలసిన ఐపీల్ సీజన్ ఆలస్యంగా మన ముందుకు రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యూఏఈ లో ఐపీల్ నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సిద్ధం అవుతున్నాయి. ఇక ఇప్పటికే క్రీడాకారులందరు కూడా యూఏఈ కి చేరుకున్నారు. ఇది ఇలా ఉంటె చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కరోనా కలకలం రేపింది అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త నిజమే.

చెన్నై జట్టులో ఓ క్రీడాకారునికి కరోనా సోకింది. అయితే చెన్నై జట్టులోని రైట్ హ్యాండ్ బౌలర్ దీపక్ చాహర్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అలాగే ఇతనితో పాటు మరో పలువురికి కూడా కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు. మొత్తానికి కరోనా దాటికి చెన్నై జట్టులో గందరగోళం ఏర్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here