Chengalrayudu : అరెస్టయితే, బెయిల్ తెచ్చుకోండిలా: కార్యకర్తలకు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ వినూత్నమైన సలహా.!
NQ Staff - November 19, 2022 / 10:23 PM IST

Chengalrayudu :న్యాయ వ్యవస్థను, చట్టాల్నీ గౌరవించాలి.! ఎవరైనా మామూలుగా చెప్పే మాట ఇది. కానీ, రాజకీయ నాయకులకు ఇది వర్తించదు. ఎలా చట్టాల నుంచి తప్పించుకోవాలి.? ఎలా న్యాయ వ్యవస్థలోని లూప్ హోల్స్‌ని వినియోగించుకుని బయటపడాలి.? అన్న విషయాలపై రాజకీయ నాయకులు మాస్టర్ డిగ్రీలు చేసేశారు.
వాళ్ళూ వీళ్ళూ అని కాదు.. దాదాపుగా ప్రముఖ రాజకీయ నాయకులందరిదీ అదే తీరు. అందుకే, పెద్ద పెద్ద నేరాలు చేసి, చాలా తేలిగ్గా తప్పించుకుంటుంటారు.
ఇదీ వ్యవస్థల్ని నాశనం చేసే తీరు..
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, పార్టీ కార్యకర్తలకు ఓ వినూత్నమైన సలహా ఇచ్చారు. ఎవరైనా పొరపాటున అరెస్టయితే, మెజిస్ట్రేట్ ముందుకు వెళ్ళినప్పుడు అబద్ధాలు ఆడితే సరిపోతుందట. ‘మీరు చెప్పేదమైనా వుందా.?’ అని అడిగితే, ‘మేడమ్.. చెప్పుకోకూడని చోట దారుణంగా పోలీసులు కొట్టారు..’ అని చెప్పాలన్నది చెంగల్రాయుడి సలహా.
ఇటీవలి కాలంలో ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. కానీ, పోలీసులు అంత తేలిగ్గా వదలరు. వైద్య పరీక్షలు చేయిస్తారు. కార్యకర్తల్ని నిండా ముంచేయడానికే అన్నట్టుంది చెంగల్రాయుడి ఉచిత సలహా. కార్యకర్తలా.? ఉన్మాదులా.? అని ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుంటుంది మరి.. అలా వాళ్ళని తయారు చేస్తున్నారీ రాజకీయ నాయకులు. ఉన్మాదం కార్యకర్తలది కాదు, రాజకీయ నాయకులది.
అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ రావాలంటే జడ్జి ముందు ఇలా చేయండి అంటూ… చంద్రబాబు సమక్షంలో టీడీపీ కార్యకర్తలకు ట్రెయినింగ్ ఇస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు.. #GoodByeBabu #PoliticalTerroristCBN pic.twitter.com/CexXkpoZnb
— Sri krishna reddy (@krishnareddy083) November 19, 2022