Charan Comments On Choreographer Rakesh Master : మా నాన్నను చెడగొట్టింది వాళ్లే.. రాకేష్ మాస్టర్ కొడుకు ఫైర్..!
NQ Staff - June 25, 2023 / 10:04 AM IST

Charan Comments On Choreographer Rakesh Master : రీసెంట్ గా కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో మృతిచెందారు. చాలా రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దాంతో ఆయన అభిమానులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ ఒకప్పుడు లెజెండరీ కొరియోగ్రాఫర్.
ఇప్పటి వరకు దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేశారు. అయితే ఆయన మానసిక పరిస్థితి కారణంగా ఆయనకు అవకాశాలు రావట్లేదు. అప్పటి నుంచి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటున్నారు. ఎన్నో వందల ఇంటర్వ్యూలలో ఆయన చేసిన కామెంట్లు సంచలనం రేపాయి.
అయితే ఇప్పుడు రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు చరణ్ తాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. మా నాన్న చెడిపోవడానికి మీడియానే ప్రధాన కారణం. ఆయన్ను కావాలనే నెగెటివ్ గా చూపించారు.
కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు చేసి ఆయన లైఫ్ ను పాడు చేశారు. సమాజంలో నెగెటివ్ ఇంప్రెషన్ కలిగే విధంగా చేశారు. ఇప్పటికైనా ఇలాంటి వీడియోలు చేయడం ఆపేయండి. మా ఫ్యామిలీని మీడియాలో చూపించడం మానేయండి. మా జీవితాలను చీకట్లోకి లాగకండి అంటూ ఫైర్ అయ్యాడు చరణ్.