Revanth Reddy : రేవంత్ కు సపోర్టుగా మారిన ఆ ఇద్దరు మంత్రులు.. ఇక తిరుగు లేనట్టేనా..?

NQ Staff - February 2, 2024 / 12:27 PM IST

Revanth Reddy : రేవంత్ కు సపోర్టుగా మారిన ఆ ఇద్దరు మంత్రులు.. ఇక తిరుగు లేనట్టేనా..?

Revanth Reddy :

ఇన్ని రోజులు రేవంత్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లోనే చాలా మంది నేతలు ఉండేవారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఆయన్ను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. రేవంత్ చేసే ప్రతి పనికి, రేవంత్ మాట్లాడే ప్రతి మాటకు నిత్యం ఎదురు తిరుగుతూనే వస్తున్నారు చాలా మంది సీనియర్ నేతలు. దాంతో రేవంత్ కు కూడా చాలానే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకానొక సమయంలో రేవంత్ మీద అధిష్టానానికి ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చినప్పుడు కూడా ఎన్నో ఫిర్యాదులు ఢిల్లీకి వెళ్లాయి.

రేవంత్ రెడ్డి మీద ప్రధానంగా నల్గొండ కీలక నేతలు అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక జగ్గారెడ్డి, హన్మంతరావు లాంటి వారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నడూ వారిపై తన వాయిస్ ను బహిరంగంగా వినిపించలేదు. ఎప్పుడైనా సరే అందరినీ కలుపుకుని పోయేందుకు మాత్రమే ప్రయత్నం చేశారు. కాగా రేవంత్ అలుపెరగని కృషితో పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇలాంటి సమయంలో రేవంత్ కృషిని గుర్తించిన అధిష్టానం రేవంత్ ను సీఎం చేసింది.

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ లో కూడా చాలానే మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ కృషిని వారు కూడా గుర్తిస్తున్నారు. ఇన్ని రోజులు వ్యతిరేకించిన వారందరూ ఇప్పుడు రేవంత్ కు సపోర్టుగా మారుతున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రూటు మార్చినట్టు కనిపిస్తున్నారు. మొన్న రేవంత్ మీద కేటీఆర్, హరీష్‌ రావు విమర్శలు చేస్తే కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి తీవ్రంఘా ఖండించారు. రేవంత్ ను పొగడ్తలతో ముంచెత్తారు. రేవంత్ రెడ్డి తనలాగే పోరాటయోధుడు అని గుర్తు చేసుకున్నారు.

రేవంత్ కాలి గోటికి కూడా కేటీఆర్ సరిపోడంటూ కొనియాడారు. దాంతో ఆయన ఇప్పుడు రేవంత్ కు మద్దతుగా మారాడని అర్థం అయిపోయింది. ఇక అటు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ కు సపోర్టుగా మారుతున్నాడు. రేవంత్ సీఎంగా పనికి రాడంటూ బీఆర్ఎస్ చేస్తున్న కామెంట్లకు ఆయన ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.

రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలుసని.. ఆయన సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపిస్తారంటూ తెలుపుతున్నారు ఉత్తమ్ కుమార్. దాంతో ఇప్పుడు ఈ ఇద్దరు కీలక నేతల మద్దతు రేవంత్ కు దొరికింది కాబట్టి ఆయన ఇక హ్యాపీగా ఉండొచ్చు అంటున్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ కు ఇన్ని రోజులు వ్యతిరేకంగా ఉన్న వారంతా ఇప్పుడు అండగా మారుతున్నారు కాబట్టి రేవంత్ కు ఇక తిరుగు లేదని అంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us