జగన్ ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చిన చంద్రబాబు

Advertisement

అమరావతి: ఈ కరోనా కష్ట కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్ళతో ఆంధ్రప్రదేశ్ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా నియమించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ నిర్ణయం పై గవర్నర్ కూడా తన ఆమోదాన్ని తెలిపారు. దీనితో మూడు రాజధానులు ఏర్పాటుకు రంగం సిద్దమైంది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్ ఇప్పుడు మూడు రాజధానులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. జగన్ కు తన మూడు రాజదానుల నిర్ణయం పై నమ్మకం ఉంటే వైసీపీలోని ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి, మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్తూ జగన్ కు 48 గంటల సమయం ఇచ్చారు. 48 గంటల్లో జగన్ ప్రభుత్వం స్పందించకుంటే మీడియా ముందు వచ్చి మూడు రాజదానుల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివారిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు రాజదానుల అంశం పై జనసేన అధినేత స్పందిస్తూ…టీడీపీ, వైసీపీ అధినేతలందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here