Chandrababu Trying Bring Nara Brahmani In Politics : బాలయ్యకు బ్రాహ్మణితో చెక్ పెడుతున్న చంద్రబాబు.. ఇదేం రాజకీయం..!
NQ Staff - September 18, 2023 / 11:25 AM IST

Chandrababu Trying Bring Nara Brahmani In Politics :
చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ కకావికలం అయిపోయింది. ఇన్ని రోజులు చంద్రబాబు ఉన్నాడు కాబట్టి టీడీపీ భవిష్యత్ నేత గురించి పెద్దగా చర్చ సాగలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు స్కిల్ డెవలప్ కేసులో అరెస్ట్ కావడంతో ఇప్పుడు టీడీపీ భవిష్యత్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరేమో చంద్రబాబు రెండు మూడు రోజులో బయటకు వచ్చేస్తారని అంటున్నారు. మరికొందరు మాత్రం చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీలో ఆందోళన మొదలైంది. టీడీపీని ఇప్పుడు ఎవరు నడిపించాలనే వాదన మొదలైంది.
లోకేష్ ఉన్నాడుగా అని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. కానీ లోకేష్ కు అంత సమర్ధత లేదు. ఇంకో ఇషయం ఏంటంటే త్వరలోనే లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొన్న నారా బ్రాహ్మణి మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. త్వరలోనే నా భర్త లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారేమో అని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దాంతో లోకేష్ కూడా జైలుకు వెళ్తే నందమూరి బాలయ్య రంగంలోకి దిగాలని చూస్తున్నాడు. మొన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సీట్లో బాలయ్య కూర్చుని తాను ఉన్నానని.. జగన్ అంతు చూస్తానని చెప్పాడు.
కానీ బాలయ్య మాటలను కనీసం ఎల్లో మీడియాలో కవర్ కూడా చేయలేదు. ఎందుకంటే బాలయ్య నాయకత్వాన్ని చంద్రబాబు వర్గం ఒప్పుకోవట్లేదు. అంతే కాదు చంద్రబాబు తాను జైలుకు వెళ్తే ఎవరిని ముందుకు తేవాలనేది కూడా చెప్పేసి అందరినీ మేనేజ్ చేశాడు. అందుకే బాలయ్య మాటలను ఎల్లో మీడియా కవర్ చేయలదు. కానీ మొన్న బ్రాహ్మణి మాట్లాడిన మాటలను మాత్రం బాగా హైలెట్ చేస్తూ రాసిపడేసింది ఎల్లో మీడియా పత్రిక. అంటే లోకేష్ జైలుకు వెళ్తే కచ్చితంగా బ్రాహ్మణిని రాజకీయాల్లోకి తేవాలని చూస్తోంది నారా కుటుంబం, చంద్రబాబు వర్గం.
టీడీపీ పార్టీ నందూమరి చేతుల్లోకి వెళ్లొద్దని.. నారా బ్రాహ్మణి చేపడితే తిరిగి తమ చేతుల్లోనే పార్టీ ఉంటుందనేది చంద్రబాబు వాదన. పైగా నారా బ్రాహ్మణి బాగా మాట్లాడగలదు. స్పీచ్ ఇచ్చే సామర్థ్యం ఆమెకు ఉంది. అందుకే ఆమెను తెరపైకి తీసుకొస్తున్నారు. అంటే బాలయ్యకు స్వయంగా తన కూతురుతోనే చెక్ పెట్టేస్తున్నాడు చంద్రబాబు. సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ఆయన వారసుడు బాలయ్య నాయకత్వం వహిస్తే కూడా చంద్రబాబు సహించలేకపోతున్నారు.
ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఎంత దారుణం.. బాలయ్య ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. పైగా నందమూరి ప్యాన్స్ సపోర్ట్ కూడా ఉంది. అయినా సరే బాలయ్య నాయకత్వాన్ని చంద్రబాబు సహించట్లేదు. కేవలం తన కుటుంబ సభ్యులు మాత్రమే టీడీపీనినడిపించాలిఅన్నట్టు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కుట్రలను నందమూరి కుటుంబం అర్థం చేసుకోవాలని కోరుతున్నారు బాలయ్య ఫ్యాన్స్.