Chandrababu : చంద్రబాబు స్మార్ట్ రింగ్.! రేటు 30 వేలట.! ఇండియాలో దొరకదట.!

NQ Staff - December 7, 2022 / 12:42 PM IST

Chandrababu : చంద్రబాబు స్మార్ట్ రింగ్.! రేటు 30 వేలట.! ఇండియాలో దొరకదట.!

Chandrababu : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి చేతి వేలికి ఈ మధ్య ఓ రింగు కనిపిస్తోంది. సాధారణంగా ఆయన బంగారం లేదా ఇతర మెటల్స్‌తో తయారైన ఉంగరాల్ని ఉపయోగించరు. అది ఆయనకు ఇష్టం వుండదు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరే. చంద్రబాబు చేతికి వున్న రింగు, అందానికి సంబంధించినదో, హోదా చాటుకునేందుకో కాదు.. ఇది స్మార్ట్ రింగ్.

చంద్రబాబు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వ్యక్తిగత వైద్య సిబ్బంది సమాచారం తెలుసుకోవాల్సి వుంటుంది. అవసరమైనప్పుడు తగిన వైద్య సహాయం అందించాల్సి వుంటుంది.

విదేశాల నుంచి తెప్పించుకున్న స్మార్ట్ రింగ్..

విదేశాల్లో స్మార్ట్ రింగ్స్ ఈ మధ్య బాగా వాడుకలోకి వచ్చేశాయి. అలాంటిదే ఈ రింగ్. ఖరీదు కాస్త ఎక్కువే. 30 వేల రూపాయలు ఈ రింగ్ ఖరీదు. ఉంగరంలో వున్న సెన్సార్లు బీపీ, ఆక్సిజన్ లెవల్స్, హార్ట్ బీట్ వంటి వాటిని ఎప్పటికప్పుడు లెక్కించి, ఆ సమాచారాన్ని స్మార్ట్ ఫోన్ ఆధారంతో వైద్యులకు చేరవేస్తాయి.

చంద్రబాబు వ్యక్తిగత వైద్య సిబ్బంది ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి, అవసరమైతే తక్షణం వైద్య చికిత్స అందిస్తారు.

‘స్మార్ట్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకే తాను ఈ రింగ్ వాడుతున్నాననీ.. విదేశాల నుంచి ఈ రింగ్ తెప్పించడం జరిగిందనీ. ఇంకా ఈ దేశంలో ఇది అందుబాటులోకి రాలేదనీ’ చెప్పారు చంద్రబాబు తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us