ఉపఎన్నికలు మొదలు అవ్వబోతున్నాయి అనగా చంద్రబాబు కి పనబాక లక్ష్మి చావుదెబ్బ ?

తిరుపతి ఉపఎన్నిక టీడీపీ పార్టీలో కొత్త తలకాయ నొప్పులకు కారణం అయ్యింది. టీడీపీ తమ పార్టీ అభ్యర్థి గా పనబాక లక్ష్మి పేరును ప్రకటించగా ఇప్పుడు ఈ విషయంలో పెద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు పనబాక లక్ష్మి బీజేపీ లో చేరడమే ఆలస్యం అనుకుంటున్న సందర్భంలో చంద్రబాబు ఆమె పేరును ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. బీజేపీ లో చేరడాన్ని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు ఆమెను కావాలనే అభ్యర్థిగా ప్రకటించి ఇరుకున పెట్టినట్టు తెలుస్తుంది. అటు బీజేపీ కి ఇటు పనబాకకు ఒక్క ఉపఎన్నిక తో చెక్ పెట్టినట్టుగా క్రింది స్థాయి నేతలు చెప్పుకుంటున్నారు.

panabaka lakshmi

పనబాక లక్ష్మి కక్కలేక..మింగలేక

పనబాక లక్ష్మి కి సైతం కక్కలేక..మింగలేక..అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఒక్క మాట కూడా చెప్పకుండా తన పేరును తిరుపతి ఉపఎన్నికల్లో ప్రకటించడంతో అక్కడ ఉన్న పరిస్థితులను ఎలా చక్కబెట్టాలో అర్ధం కాకుండా ఉంది. క్షేత్రస్థాయిలో అద్వానంగా ఉన్న టీడీపీ వర్గాన్ని ఎలా ముందుకు నడిపించి ఎలెక్షన్ లో గెలుపు సాధించడం అంటూ ఆమె తలపట్టుకుంటున్నారట. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగాలంటూ సన్నిహితులతో వాపోతున్నారట. ఒక వైపు బీజేపీ లో చేరడానికి సర్వం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఇలా తన పేరును ప్రకటించడం పట్ల ఆమె తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. లక్ష్మి పేరును ప్రకటించి ఇన్ని రోజులవుతున్న ఆమెలో ఎలాంటి చలనం లేకపోవడం తో ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

బీజేపీ తో ఒప్పందం

ఇకపోతే పనబాక లక్ష్మి తిరుపతి ఎన్నికల్లో పాల్గొనాలంటే తన డిమాండ్స్ ని నెరవేర్చాలంటూ పట్టు పట్టినట్టు తెలుస్తుంది. లక్ష్మి షరతులను ఒప్పుకున్నట్టే చెప్తూ మరోవైపు చంద్రబాబు, బీజేపీ ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారట. ఎలాగైనా ఈ ఉపఎన్నికలో గెలిచి పార్టీ కి పూర్వ రూపం తేవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒంటరిగా గెలుపు సాధ్యం కాకపోతే బీజేపీ ని సైతం కలుపుకొని ముందుకు వెల్లాలని బాబు ఆలోచిస్తున్నారట. పనబాక పేరును ప్రకటించి ఆమెను బీజేపీ కి వెళ్లకుండా చేయడంలో సక్సెస్ అయినా బాబు, బీజేపీ తో పోతు కుదిరితే ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థికే తమ మద్దతు తెలపాలని అనుకుంటున్నారట. ఈ పరిణామాలన్ని గమనిస్తుంటే పనబాక నెత్తిమీద నీళ్లు చల్లినట్టే అని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement