Chandrababu : ఓటుకు నోటు కేసు.. ఆ గొంతు ఎవరితో తెలిసిపోయింది.. చంద్రబాబుకు కొత్త సమస్య?

Chandrababu : ఓటుకు నోటు కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఏసీబీ స్పెషల్ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసుకు సంబంధించి పలు విషయాలను కోర్టు తాజాగా ధృవీకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని… అలా చేస్తే మనవాళ్లు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుతారని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారంటూ అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కోర్టుకు వెల్లడించారు. తనతో ఫోన్ లో చంద్రబాబే మాట్లాడారని ఆయన స్పష్టం చేశారు.

chandrababu note for vote case update
chandrababu note for vote case update

ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి తాజాగా ఈ కేసుపై విచారణ సాగించారు. దీంతో స్టీఫెన్ సన్ తన వాంగ్మూలాన్ని కోర్టుకు వినిపించారు. అలాగే… చంద్రబాబు ఫోన్ లో తనతో మాట్లాడిన ఆడియోను కూడా కోర్టులో ప్లే చేశారు. దాన్ని విన్న స్టీఫెన్ సన్… ఇదే ఆడియో అంటూ ధృవీకరించారు. అలాగే… తనకు 50 లక్షల రూపాయల అడ్వాన్స్ ఇస్తుండగా… రికార్డు అయిన వీడియో.. అందులో ఉన్న దృశ్యాలను చూసి స్టీఫెన్ సన్ ధృవీకరించారు. తనకు అడ్వాన్స్ 50 లక్షలు ఇచ్చే సమయంలో ఎంపీ రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఉన్నారని… స్టీఫెన్ సన్ చెప్పడంతో పాటు కోర్టు కూడా వీడియో క్లిప్ ద్వారా గుర్తించింది.

మొత్తం మీద ఆరోజు జరిగిన సంఘటనకు ప్రధాన కర్త చంద్రబాబేనని… ఆ గొంతు కూడా చంద్రబాబుదేనని కోర్టు నమ్మింది. దీనిపై ఎటువంటి తీర్పు చెబుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ కేసు విచారణ జరుగుతూనే ఉన్నది. తాజాగా ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఈనెల 7కు కోర్టు వాయిదా వేసింది. ఆరోజు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Advertisement