జమిలి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు నాయుడు

Advertisement

జమిలి ఎన్నికలు అంటే లోకసభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరగడాన్ని జమిలి ఎన్నికలు అంటారు. అయితే టీడీపీ నేతలు ఇప్పుడు ఈ జమిలి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడే తెలంగాణలో టీడీపీ పార్టీ భూస్థాపిం అయ్యింది. అయితే రానున్న రోజుల్లో ఏపీలో కూడా టీడీపీ పార్టీ భూస్థాపితం కానుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. వైసీపీ నాయకులు ఇలా అంటుంటే టీడీపీ నాయకులు మాత్రం జమిలి ఎన్నికలు వస్తున్నాయని, వాటిలో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో జమిలి ఎన్నికలు వస్తాయని అందులో టీడీపీ విజయం సాధిస్తుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు స్పందిస్తూ జమిలి ఎన్నికలంటూ వస్తే టీడీపీ ఈసారి సున్నా సీట్లు రావడం ఖాయమని ఎద్దేవా చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసి కూడా చంద్రబాబు నాయుడు ఏ ధీమాతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here