వైసీపీ పాలనలో దళితుల పై దాడులు పెరుగుతున్నాయి: చంద్రబాబు నాయుడు

Advertisement

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దళితులపై వైసీపీ నాయకులు అనవసరమైన ఆరోపణలు చేస్తు వారికి శిరోముండనం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కైకలూరులో జరిగిన సంఘటన చూస్తే వైసీపీ నాయకులు చేస్తున్న ఆగడాలు అర్ధామవుతాయని చంద్రబాబు వెల్లడించారు.

కైకలూరులో వైసీపీ నాయకులపై ఒక దళిత యువతి పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వడంతో ఆగ్రహించిన వైసీపీ నాయకుడు యువతి యొక్క ఇంటిని తలగబెట్టారని చంద్రబాబు నాయుడు ట్విటర్ లో పేర్కొన్నారు. ఈ ఘటనలో కుటుంబం సర్వం కోల్పోయిందని, వారికి టీడీపీ నాయకులు అండగా ఉంటారని బాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. శిరోముండనం చేస్తున్న వారిపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here