శిరోముండనం ఘటనకు జగన్ బాధ్యత వహించాలి: చంద్రబాబు

Advertisement

విశాఖలోని పెందుర్తిలో శ్రీకాంత్ అనే దళిత యువకుడిపై జరిగిన శిరోముండనం ఘటనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగియని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 300 మంది దళితులపై దాడులు జరిగాయని అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం దళితులను విమర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చాలా చోట్లవైసీపీ నాయకులే దళితులపై దాడులు చేస్తున్నారని, అందుకే జగన్ వారిపై చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించారు. వీడియో ఆధారాలు ఉన్నా కూడా ప్రభుత్వం తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రజా సంఘాలు ఉద్యమం చేయాలని, వారికి తాను తోడుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here