ఏపీలో చంద్రబాబు ఓటమి చెందినప్పటినుండి వైసీపీ పాలనపై, సీఎం జగన్ పై విషం చిమ్ముతున్నాడు. ప్రభుత్వం తలపెట్టే ప్రతి అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నాడు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇస్తానురాజ్యంగా మాట్లాడుతూ సభ నుండి సస్పెండ్ కూడా అయ్యారు చంద్రబాబు. ఇలా వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటినుండి ఏదో ఒక తంతు ముందేసుకుంటూ ప్రభుత్వంపై మాటల యుద్ధం చేస్తున్నాడు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. తాజాగా ప్రధాని నరేంద్రమోడీపై కూడా పలు అబద్దాలు మాట్లాడుతూ మరో వివాదాల్లో చిక్కుకుంటున్నారు చంద్రబాబు.
అయితే అమరావతి లాగానే అన్ని కార్యకలాపాలు ఒకే దగ్గర ఉండాలని ఢిల్లీలో పార్లమెంట్ ను కూడా ఒకే దగ్గర కడుతున్నారని, ప్రధాని మోడీ అమరావతిని ఫాలో అవుతున్నారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. అసలు ప్రధాని ఏంటి ? చంద్రబాబును ఫాలో అవడం ఏంటి ? వినడానికి కాస్త కామెడీగా ఉంది. నిజానికి ఇక్కడ గమనించవల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నాలుగంతస్థుల భవనానికి రూ. 927 కోట్లు ఖర్చు చేస్తుంటే.. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హై కోర్ట్ కోసం ఏకంగా రూ. 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
- Advertisement -
దీనితో చంద్రబాబు అనవసరంగా ప్రభుత్వ నిధులను వృధా చేస్తున్నాడని వైసీపీ ఆరోపించింది. ఇకపోతే జగన్ అధికారాన్ని చేపట్టిన తరువాత మూడు రాజధానుల ప్రస్తవాన్ని చేపట్టి, ఆ మూడు రాజధానులను ఏర్పటు చేయాలనీ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో అమరావతినే రాజధానిగా ఉండాలని చంద్రబాబు పట్టు పట్టాడు. అయిన జగన్ మాత్రం అస్సులు వెనక్కు తగ్గడం లేదు. ఇక ఈ విషయంలో కూడా మోడీని బద్నామ్ చేసాడు చంద్రబాబు.
అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మోడీ కూడా చెప్పారని ప్రస్తావించాడు. కానీ మోడీ ఏరోజు రాజధాని విషయంలో తలదూర్చలేదు. ఇలా ప్రతి విషయంలో మోడీని లాగుతూ వివాదంగా మారుతున్నాడు చంద్రబాబు. అంతేకాదు పలు విషయాల్లో మోడీ దగ్గర రెడ్ హ్యాండెడ్ గా కూడా దొరికాడట. అయిన కూడా చంద్రబాబు బుద్ధి మారడం లేదని పలువురు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.