Ayyanna Patrudu : అయ్యన్న పాత్రుడి కుమారుడికి టికెట్ లేనట్టే.. షాక్ ఇచ్చిన చంద్రబాబు ..!

NQ Staff - February 2, 2024 / 06:25 PM IST

Ayyanna Patrudu : అయ్యన్న పాత్రుడి కుమారుడికి టికెట్ లేనట్టే.. షాక్ ఇచ్చిన చంద్రబాబు ..!

Ayyanna Patrudu :

టీడీపీలో చంద్రబాబు తర్వాత ఎక్కువగా ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకోవాలని అయ్యన్న పాత్రుడు పడని పాట్లు లేవు. ఇక చంద్రబాబు మెప్పుకోసం వైసీపీ నేతలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే వస్తున్నారు. ఎన్ని తిట్లు తిడితే చంద్రబాబు దగ్గర అన్ని మార్కులు అన్నట్టు ఆయన రెచ్చిపోతున్నారు. నోటికి ఏదొస్తే అది తిడుతూ.. వైసీపీని, జగన్ ను తిట్టడమే తన పని అన్నట్టు ఆయన రెచ్చిపోతున్న విధానాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో అయ్యన్న పాత్రుడికి అధిష్టానం షాక్ ఇచ్చింది. అయ్యన్న పాత్రుడు ఆయన కొడుకు కోసం ఆరాటపడుతున్నాడు.

ఎలాగైనా తన కొడుకును రాజకీయాల్లో ఎదిగే విధంగా చేయాలని ఆరాటపడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. ఇందుకోసం ఆయన పడని పాట్లు లేవు. టీడీపీ సోషల్ మీడియా చీఫ్ గా చింతకాయల విజయ్ అదే అయ్యన్న పాత్రుడు తన కొడుకును నియమించేలా చేసుకుని మురిసిపోయారు. ఇక ఎలాగైనా అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ను తన కొడుకుకు ఇప్పించుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించాలని ఆరాటపడ్డారు. కానీ విజయ్ కు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ సారి అనకాపల్లి ఎంపీ టికెట్ ను దిలీప్ చక్రవర్తికి ఇవ్వబోతున్నారంట.

Chandrababu Gave A Shock Of Ayyanna Patrudu

Chandrababu Gave A Shock Of Ayyanna Patrudu

ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో అయ్యన్న పాత్రుడు కుమిలిపోతున్నాడు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తన కొడుకు ఎంట్రీ ఇప్పించాలని ఆశ పడితే ప్లాన్ మొత్తం రివర్స్ కావడంతో దిగాలుగా ఉన్నాడు అయ్యన్న పాత్రుడు. అయితే దీనంతటికీ కారణం విజయ్ నిర్లక్ష్యమే అని తెలుస్తోంది. అందుకే ఆయన్ను టీడీపీ సోషల్ మీడియా చీఫ్‌ పదవి నుంచి తొలగించినట్టు సమాచారం. వాస్తవానికి విజయ్ ఎన్నడూ కూడా టీడీపీ సోషల్ మీడియాను బలంగా నడిపించలేక పోయారు.

లోకేష్ లాంటి కీలక నాయకుడు ఫోన్ చేసినా సరే సరిగ్గా రెస్పాండ్ కాలేదు. దాంతో పాటు టీడీపీలో మాజీ మంత్రులు, కీలక నేతలుగా పేరు గాంచిన వారందరూ ఫోన్లు చేసినా సరే విజయ్ మాత్రం పెద్దగా రెస్పాండ్ కాలేదు. అందుకే ఆయన్ను పక్కకు తప్పించారు. ఆయన వ్యవహార శైలి ఎవరికీ పెద్దగా నచ్చట్లేదు.

ఇలాంటి నిర్లక్ష్యం ఉన్న వ్యక్తి రాజకీయాలకు పనికి రాడని చెబుతున్నారు. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పేశారంట. దీంతో అయ్యన్న పాత్రుడి కొడుకు భవిష్యత్ అగమ్య గోచరంగా మారిపోయింది. ఇక అయ్యన్న పాత్రుడికి మాత్రం నర్సీపట్నం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దాంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆయనకు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us