Chandrababu : ఇప్పుడు కూడా చంద్రబాబు కుల రాజకీయాలు.. ఇవేం దిక్కుమాలిన చర్యలు..!
NQ Staff - September 25, 2023 / 02:51 PM IST

Chandrababu :
చంద్రబాబు మొదటి నుంచి కుల రాజకీయాలే చేస్తున్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం చూసుకుంటే ఇది స్పష్టంగా అర్థం అవుతోంది. కేవలం తన కులం అయితే చాలు వారికి ఏం అడిగినా ఇచ్చేస్తారు. మిగతా కులాలను మాత్రం అంటరాని వారుగా చూస్తారు. ఇలాంటి కుల రాజకీయాలు మొదటి నుంచి చంద్రబాబు మాత్రమే చేస్తున్నారు. ఆయన గతంలో సీఎంగా ఉన్నప్పుడే కాదు ఇప్పుడు జైలులో ఉండికూడా ఇలాంటి నీచపు బుద్ది పోనిచ్చుకోవట్లేదు. ఇప్పుడు కూడా చంద్రబాకు మద్దతు ప్రకటిస్తున్న వారిలో దాదాపు ఆయన సామాజిక వర్గం వారే కొన్ని అల్టిమేటమ్స్ జారీ చేస్తున్నారు.
అందులో కొన్ని చూసుకుంటే.. చంద్రబాబుకు మద్దతుగా కార్ల ర్యాలీ చేస్తున్నవారికి 50శాతం ఫుడ్ సబ్సిడీ ఇస్తామని సూర్యాపేట వద్దనున్న లిటిల్ విలేజ్ హోటల్ ప్రకటించింది. ఈ హోటల్ నడుపుతోంది చంద్రబాబుకు సామాజిక వర్గం వ్యక్తులే. అంతెందుకు ఇదే హోటల్ కు చెందిన వి.ఆర్.కన్నెగంటి చంద్రబాబుకు మద్దతుగా ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు. అందులో వైసీపీ ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అంతే కాదు గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతుగా.. టీడీపీ వ్యతిరేకులపై పుంఖానుపుంఖాలుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టించారు.
ఇటు హైదరాబాద్ లో చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం వారు, వైసీపీ, వైఎస్సార్ అభిమానులు తమ కర్రీస్ పాయింట్ల వద్దకు రావొద్దంటూ కర్రీస్ పాయింట్ల సెక్రటరీ పేరుతో బ్యానర్లు వెలుస్తున్నాయి. చంద్రబాబు వ్యతిరేకులు, వైసీపీ కార్యకర్తలు తమ కార్ షోరూంకు రావొద్దంటూ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో XENEX షోరూం తన దుకాణం ముందు బ్యానర్ పెట్టించింది. ఇదొక్కటే కాదు.. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు నడిపిస్తున్న కంపెనీలకు సంబంధించిన పాలు, గుడ్లు, కూరగాయలు, సరుకులు, టీవీలు, సినిమాలు, ఇలా అన్నింటినీ బహిష్కరిస్తే ఎలా ఉంటుంది అన్నదానిపై చర్చిస్తున్నారంట.
ఇక్కడే కాదు.. ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు కులానికి చెందిన వారి బట్టల దుకాణాలు, హోటళ్లు లాంటి వాటి నుంచి రెడ్డి సామాజిక వర్గాన్ని, ఇతర కులాలను, వైఎస్సార్ అభిమానులున బహిష్కరిస్తే ఎలా ఉంటుందన్నదానిపై డిస్కషన్ చేస్తున్నారంట. ఇదంతా టీడీపీ పార్టీ వెనకుండి నడిపిస్తున్న కుట్ర. ఇంతకన్నా దారుణమైన చర్యలు ఇంకొకటి ఉండవు. గతంలో జగన్ అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు సామాజిక వర్గానికి ఎలాంటి కండీషన్లు పెట్టలదు.
ఇలాంటి బ్యానర్లు, పోస్టర్లు ఏ రెడ్డి సామాజిక దుకాణాల ముందు పెట్టలేదు. ఎందుకంటే జగన్ కు కుల రాజకీయాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ చంద్రబాబుకు మాత్రం నిలువెల్లా ఇలాంటి చెత్త రాజకీయాలే చేస్తుంటారు. అయితే ఇదంతా జరుగుతోంది కేవలం పక్క రాష్ట్రాల్లో మాత్రమే. ఇలాంటి బ్యానర్లు వెలుస్తోంది హైదరాబాద్ లో. చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, శుభనేశ్వరి ఉంటుంది హైదరాబాద్ లోనే. అందుకే అక్కడ ఉన్న వారి సామాజిక వర్గం ఇలాంటి చేష్టలకు పూనుకుంటోంది. దీనిపై ఏపీ ప్రజలు భగ్గుమంటున్నారు. ఇతర కులాలు కూడా చంద్రబాబు మద్దతు దారులను, ఆయన వర్గాన్ని ఇలాగే వెలేస్తే పరిస్థితి ఏమవుతుందో చూస్కోండి అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.