Chandrababu : ఈ పంచాయతీ ఎన్నికలు జరగడమేమో కానీ.. ఏపీలోని పలు పార్టీల నేతల మధ్య పార్టీ ఫుల్లుగా పంచాయితీ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలు రోజురోజుకూ వేడెక్కతున్నాయి. రాజకీయ నాయకులు కూడా అస్సలు ఆగడం లేదు. ఓ రేంజ్ లో ఉన్నారు. అసలే.. అధికార పార్టీ వైసీపీకి, ఎన్నికల సంఘం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అది పక్కన పెడితే… వైసీపీ, టీడీపీ మధ్య కూడా వైరం బాగానే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి.. తమ సత్తా చాటాలని టీడీపీ భావిస్తుంటే… వైసీపీ కూడా పంచాయతీ ఎన్నికల్లో గెలిచి మరోసారి తమ సత్తా చాటాలని ఉబలాటపడుతోంది.
అందుకే రెండు పార్టీల మధ్య పోరు జోరుగా కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య గొడవలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ పంచాయతీలో జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని ఏకంగా… ఎన్నికల కమిషన్ అడిషనల్ డీజీకే ఫోన్ చేసి మరీ ఫిర్యాదు చేశారు.
నిమ్మాడ గ్రామం ఎవరిదో కాదు.. ప్రస్తుత శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడిది. తన తండ్రి అచ్చెన్నాయుడుది. నిమ్మాడ గ్రామం టీడీపీకి కంచుకోట. కానీ.. ఆ కంచుకోటను బద్దలు కొట్టి.. అక్కడ వైసీపీ జెండ ఎగురవేయాలని.. వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ కావాలని గొడవలు సృష్టించి.. వాటిని టీడీపీ మీదికి నెడుతున్నారని.. ఈ విషయంపై ఎన్నికల సంఘమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
చూద్దాం మరి.. చంద్రబాబు ఫిర్యాదును ఎన్నికల కమిషన్ పట్టించుకుంటుందా? వైసీపీ నేతపై చర్యలు తీసుకుంటుందా? లేదా? అని.