BIG BREAKING : సరిగ్గా 24 గంటల్లో అచ్చెన్నాయుడు జైలుకి?

Ajay G - January 23, 2021 / 10:18 PM IST

BIG BREAKING : సరిగ్గా 24 గంటల్లో అచ్చెన్నాయుడు జైలుకి?

ఏపీలో ఎక్కడ చూసినా దేవాలయాలపై దాడుల అంశం గురించే చర్చ. అదే రచ్చ. గత కొన్ని రోజుల నుంచి ఎన్నో దేవాలయాలపై అటాక్స్ జరిగినా.. రామతీర్థంలో జరిగిన ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేంద్రం కూడా సీరియస్ అయింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.

అయితే.. రామతీర్థం ఘటన తర్వాత ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై దాడి జరిగింది. ఈ దాడి ఘటనలో చంద్రబాబును ఏ1గా, అచ్చెన్నాయుడును ఏ2గా, కళా వెంకట్రావును ఏ3గా పోలీసులు చేర్చారు. మరో 12 మందిని కూడా పోలీసులు ఈ ఘటనలో నిందితులుగా చేర్చారు.

అయితే.. ఈ ఘటనలో అరెస్ట్ చేసిన కళా వెంకట్రావు బెయిల్ పై విడుదలయ్యారు. ఆయనకు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు శాంతించారు. లేకపోతే రచ్చ రచ్చ చేసేవాళ్లే.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాకనే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత, ఏపీ అధ్యక్షుడు ఇద్దరిపై కేసులు నమోదు కావడంతో టీడీపీ నేతలు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వీళ్లు అరెస్ట్ అయితే ఎలా? అంటూ పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా.. ఏపీలోని దేవాలయాల దాడుల ఘటన అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us