Nara Chandrababu Naidu : చంద్రబాబుకి వైసీపీ నుంచి ప్రాణ హాని వుందా.?
NQ Staff - November 27, 2022 / 04:19 PM IST

Nara Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికీ, ఆయన కుమారుడు నారా లోకేష్కీ ప్రాణ హాని వుందట. హత్యా రాజకీయాలంటూ మొదలైంతే, తొలి టార్గెట్ నారా లోకేష్.. అంటూ వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.
వైఎస్సార్ గనుక ‘ఊ’ అని వుంటే, మొద్దు శీను, పరిటాల రవిని చంపినట్టే చంద్రబాబునీ అంతమొందించేవాడన్నది సదరు వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి ఉవాచ.
ఫ్యాక్షనిజంలో ఎవరు తోపు.?
వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. త్వరలో నారా లోకేష్, ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడే ‘చంపేస్తాం..’ అంటూ హెచ్చరికలు చేశాక, రాష్ట్రంలో విపక్ష నేతలకు భద్రత ఎక్కడిది.?
ఎమ్మెల్యే సోదరుడ్ని వెంటనే అరెస్టు చేయాలన్నది టీడీపీ డిమాండ్. అయితే, తన తమ్ముడి వ్యాఖ్యలు వ్యక్తిగతమనీ, పార్టీకి సంబంధం లేదనీ, ప్రజా స్వామ్యంలో హింసకు తావు లేదని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి చెబుతున్నారు. మాటలు చెబితే సరిపోదు, హత్య చేస్తామని బెదిరించిన కోణంలో కేసులు నమోదు చేయించి, అరెస్టు చేయించాల్సిందే.
కాగా, చంద్రబాబుకి ప్రాణ హాని వుందనీ, ఆయనకు ఏమైనా జరిగితే అధికార పార్టీదే బాధ్యత అని టీడీపీ మండిపడుతోంది.