రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి ప్రభుత్వమే కారణం: చంద్రబాబు నాయుడు

Advertisement

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కరోనా పట్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష ధోరణి వల్ల అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, కరోనా విషయంలో ప్రభుత్వం ప్రజలకు అవగాహన కలిపించడంలో కూడా విఫలమైందని వెల్లడించారు. కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా దొరకడం లేదని, ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల నుండి లక్షల్లో వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా వల్ల అనేకమంది తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారని, ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేతివృత్తులు, కులవృత్తులు, భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలకు చాలా ఇబ్బందులన్నాయని చెప్పారు. అలాంటి ప్రతి కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థికసాయం అందించాలని కోరారు. క్వారంటైన్‌లో ఉన్న రోగులకు రూ.2వేలు ఇస్తామని గతంలో ప్రభుత్వం చెప్పిందని.. ఆ నగదును ఇవ్వాలని సూచించారు. కష్ట కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలు జగన్ కు బుద్ది చెప్తారని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here