చంద్రబాబు అద్దె ఇంటి చుట్టూ రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులు
Admin - September 29, 2020 / 05:57 AM IST

ఏపీలో ప్రజా పాలన కంటే కూడా రాజకీయ నాయకుల కక్ష్య పూరిత రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు గ్యాప్ లేకుండా విమర్శలు చేసుకుంటున్నారు. 2019 వరకు వైసీపీ నాయకులను ఆడుకున్న టీడీపీ నాయకులను ఇప్పుడు వైసీపీ నాయకులు ఆడుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజుల నుండి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యొక్క అద్దె ఇంటి చుట్టూ వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.
అమరావతి ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ఒక అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజుల్ ఈ ఇంటిని నిబంధనలు విరుద్ధంగా కట్టారని, త్వరలో కూల్చేస్తామని వైసీపీ ప్రభుత్వం ఇంటి యజమాని అయిన లింగమనేనికి నోటీసులు ఇచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లింగమనేనికి మరో నోటీస్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటంటే గతంలో కూల్చేస్తామని నోటీసులు ఇచ్చిన అధికారులు ఇప్పుడు వరదలు వస్తున్నాయి కాబట్టి ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. కూల్చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడెందుకు ఇలా మాట మారుస్తూ నిర్ణయం తీసుకుందని రాష్ట్రంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. అక్రమ కట్టడమైతే కూల్చేయకుండా, ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వడం ఏంటని రాజకీయ విశ్లేషకులు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.