Siri And Srihan : సిరి, శ్రీహాన్‌లని ‘అమ్మా.. నాన్నా’ అంటోన్న ఆ బుడ్డోడెవరు.?

NQ Staff - November 25, 2022 / 10:14 AM IST

Siri And Srihan : సిరి, శ్రీహాన్‌లని ‘అమ్మా.. నాన్నా’ అంటోన్న ఆ బుడ్డోడెవరు.?

Siri And Srihan : సిరి గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్.. శ్రీహాన్ ఈ సీజన్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్.! ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే వేదికపై.. అందునా బిగ్ బాస్ హౌస్‌లో కలుసుకున్నారు. ఇంకేముంది.? ఇద్దరూ ముద్దులు, కౌగలింతల్లో మునిగిపోయారు. పానకంలో పుడకలాగా.. ఓ బుడ్డోడు కూడా ఎంట్రీ ఇచ్చాడు. వాడి పేరు చైతూ.!

డాడీ.. మమ్మీ.. అంటూ శ్రీహాన్ గురించీ, సిరి గురించీ ముద్దు ముద్దుగా పిలుపులతో సందడి చేశాడు ఆ చిన్నోడు. ఎవరీ చిన్నోడు.? ఈ విషయమై బోల్డంత రచ్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.

కొడుకేగానీ..

సిరి, శ్రీహాన్‌ల కొడుకే ఈ చైతూ. కానీ, అసలు కొడుకు కాదు. సిరి – శ్రీహాన్ ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారట. కాదు, జస్ట్ ప్రేమికులే.. అనేవారూ లేకపోలేదు. ‘కెరీర్‌లో సెటిలయ్యాక పెళ్ళి చేసుకుందాం’ అని శ్రీహాన్‌కి బిగ్ బాస్ వేదికగా ప్రపోజల్ పెట్టింది సిరి.

అంతే కాదు, శ్రీహాన్ పేరుని తన మెడ మీద.. వెనుకాల పచ్చబొట్టు వేయించుకుంది.
ఇంతకీ, ఆ బుడ్డోడెవరు.? ఇంకెవరు, సిరి మేనల్లుడు. పెంచుకుంటున్నారు ఆ బుడ్డోడిని సిరి, శ్రీహాన్. సిరి కంటెస్టెంట్‌గా వున్నప్పుడే, ఆమె తల్లి ఈ బుడ్డోడి గురించి రివీల్ చేసింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us