Heart Attack : ఈ లక్షణాలు ఉన్న వారు గుండెపోటుకు గురికారు.. మీరున్నారేమో చూస్కోండి..!

NQ Staff - January 6, 2024 / 05:44 PM IST

Heart Attack : ఈ లక్షణాలు ఉన్న వారు గుండెపోటుకు గురికారు.. మీరున్నారేమో చూస్కోండి..!

Heart Attack :

గుండెపోటు అనేది ఈ నడుమ చాలా కామన్ అయిపోతుంది. చాలామంది ఈ రోజుల్లో గుండెపోటుకు గురవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెలు ఆగుతున్నాయి. చాలామంది చిన్న వయసులో కూడా దీని బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచే ఈ గుండెపోటు మరణాలు ఎక్కువగా చూస్తున్నాం. హార్ట్ ఎటాక్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. అయితే కొన్ని లక్షణాలు ఉన్న వారు గుండెపోటుకు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి లక్షణాలు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

సరైన హార్ట్ బీట్…

హార్ట్ బీట్ అదేనండి గుండె కొట్టుకోవడం మన హృదయానికి అతిపెద్ద సంకేతం అనే చెప్పుకోవాలి. మనం పనిచేసే సమయంలో, ప్రశాంతంగా కూర్చున్న సమయంలో ఒక్కో విధంగా ఉంటుంది దీని పనితీరు. అయితే విశ్రాంతి సమయంలో హృదయ స్పందన నిమిషానికి 60 నుండి 100 బీట్స్ ఉండాలి. ఇలా ఉంటే మీ గుండె సరిగ్గా పని చేస్తుందని అర్థం అప్పుడు మీరు దేనికీ భయపడాల్సిన అవసరం లేదు.

మంచి శక్తి స్థాయి…

మంచి శక్తిస్థాయి ఉంటే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్టే అనుకోవచ్చు. మీరు రోజంతా పనిచేసే సమయంలో గుండె బాగుంటే మంచి శక్తిస్థాయిలను కలిగి ఉంటారు. మీకు శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మాత్రం మీ గుండె సరిగ్గానే పని చేస్తున్నట్టు లెక్క. గుండె అన్ని కండరాలకు సరైన మోతాదులో రక్తాన్ని సరఫరా చేస్తుంది కాబట్టే మీరు ఎంతో శక్తివంతంగా ఉన్నట్టు లెక్క.

శ్వాస సమస్య లేదు…

కొందరు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ మీకు ఈ శ్వాస సంబంధిత సమస్య లేకపోతే మాత్రం మీకు ఎలాంటి ప్రమాదం లేనట్టే లెక్క. మీ గుండె మీ అన్ని అవయవాలకు తగినంత రక్తాన్ని పంప్ చేస్తున్నప్పుడు మీ రక్తకణాలు సరైన మోతాదులో ఆక్సిజన్ తీసుకుంటాయి. కాబట్టి శ్వాస సంబంధిత సమస్యల లేకపోతే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్టే.

వ్యాయామం తర్వాత…

మనం ఏదైనా శారీరక శ్రమ చేస్తే కచ్చితంగా అలసిపోతుంటాం. అయితే మన గుండె ఆరోగ్యంగా ఉంటే మాత్రం మనం ఎంత పని చేసినా సరే మన కండరాలకు అది ఆక్సిజన్ ను అన్ని భాగాలకు సమాంతరంగా అందిస్తుంది. కాబట్టి మనం అలసిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. మీరు అసలిపోకుండా ఉంటే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క.

ఛాతీ నొప్పి లేకపోతే…

మీకు గనక ఛాతిలో నొప్పి లాంటివి లేకపోతే మీ గుండె ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే గుండె నొప్పి అంటేనే ముందుగా ఛాతిలో నొప్పి సంకేతాలు ఇస్తుంది. కాబట్టి ఛాతిలో నొప్పి లేకపోతే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us