Sukanya Samriddhi Yojana : ఆడపిల్లలకు వరంగా సుకన్య సమృద్ధి యోజన.. 21 ఏళ్ల నాటికి రూ.65లక్షలు..!
NQ Staff - April 9, 2023 / 03:46 PM IST

Sukanya Samriddhi Yojana : కేంద్ర ప్రభుత్వం అమ్మాయిల కోసం ఆలోచించి సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. వారి భవిష్యత్ కోసం పెట్టుబడి పొదుపు పథకాన్ని తీసుకు వస్తోంది. దీని వల్ల తల్లిదండ్రులు తమ కుమార్తెల భవిష్యత్తును ఆర్థికంగా కాపాడుకోవచ్చు. ఇది దీర్ఘకాలిక పథకం. దాని ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ సారి వడ్డీరేట్లను కూడా ప్రభుత్వం పెంచింది. ఈ పథకం కింద అమ్మాయిలకు 21 సంవత్సరాలకు మెచ్యూరిటీకి వస్తుంది. కానీ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురుకు 15 ఏళ్లు వచ్చే వరకే డిపాజిట్ చేయాలి. కానీ మిగతా ఆరేండ్లు కూడా ఈ ఖాతా పని చేస్తుంది. ఆ పొదుపు పథకంలో ఏటా రూ.250 నుంచి మొదలు పెడితే రూ.1.50లక్షల వరకు చేసుకోవచ్చు.
పదేండ్ల కంటే తక్కువ వయసున్న వారికి మాత్రమే ఈ పథకం తెరవబడుతుంది. ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి దగ్గరలోని పోస్టాఫీస్ కు వెళ్లాలి. డబ్బు, చెక్కు, డిమాండ్ డ్రాప్టు లాంటి వాటి ద్వారా సొమ్మును చెల్లించవచ్చు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత చదువుల కోసం ఈ ఖాతా నుంచి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఒకవేళ మొత్తం తీసుకోవాలంటే మాత్రం 21 ఏళ్లు నిండిన తర్వాతనే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఒకవేళ ప్రతి నెలా రూ.12,500 పెట్టుబడి పెడితే ఏడాదిలో రూ.1,50,000 లక్షలు పోగుపడతాయి. ఇలా పథకం మొత్తం ముగిసే సమయానికి వడ్డీతో కలిపి రూ.65,93,071 డిపాజిట్ అవుతుంది.