ఏపీ టాప్ మినిస్టర్ కి నిర్మలా సీతారామన్ సీరియస్ వార్నింగ్ ?

Admin - December 25, 2020 / 04:14 PM IST

ఏపీ టాప్ మినిస్టర్ కి నిర్మలా సీతారామన్ సీరియస్ వార్నింగ్ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒక వార్త తెర మీదకు వస్తూ సంచలనంగా మారుతూ ఉంటుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు విమర్శలు చేసుకుంటూ వివాదాలు సృష్టిస్తుంటారు. ఇక కొందరు నాయకులైతే ఇస్తానురాజ్యంగా బూతు పురాణాలు మాట్లాడుతూ వారి నాయకత్వ విలువలను బేఖాతరు చేస్తున్నారు. ఇక నాయకుల పరిస్థితి ఇలా ఉంటె ఆఖరికి రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన వారి పరిస్థితి కూడా అదే రీతిలో ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్, న్యాయమూర్తులు, ఎన్నికల కమిషన్ వంటి వారిపై కూడా ఇస్తానురాజ్యంగా వ్యవహరిస్తూ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక ఇదే తరుణంలో మరోసారి ఒక వార్త వెలుగులో వచ్చింది. ఇప్పుడు ఈ వార్త కేంద్రం వరకు వెళ్లి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆఖరికి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ స్పందించి కాస్త సీరియస్ కూడా అయింది.

అంటే పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో మీకే అర్ధం అయి ఉంటుంది. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లాలో పలు బ్యాంకుల ముందు ప్రభుత్వం చెప్పినట్లు లోన్స్ ఇవ్వడం లేదని చెత్త పారబోసి కమిషనర్ పారబోయమన్నాడంటూ పైగా బోర్డులు కూడా పాతారు. దీనితో అటు బ్యాంకు అధికారులతో పాటు, సామాన్య ప్రజలు ఒక్కసారిగా కంగుతిన్నంత పనయ్యింది. అసలు చెత్త పారబోయడం ఏంటి ? పైగా బోర్డు పెట్టి తామే పారాయబోయమన్నాం అని చెప్పడం ఏంటని బ్యాంక్ అధికారులు సీరియస్ అయ్యారు. ఇక ఈ విషయాన్నీ వెంటనే జిల్లా వ్యాప్తంగా బ్యాంక్ అధికారులందరూ కల్లెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక కలెక్టర్ స్పందించి మునిసిపల్ సిబ్బంది అధికారులతో మాట్లాడి చెత్త తీసేలా చర్యలు తీసుకుంది.

ఇక వార్త కాస్త గల్లీనుండి ఢిల్లీ వరకు పాకింది. లోకల్ మీడియాతో సహా జాతీయ మీడియా కూడా ఈ విషయంపై కథనాలు ప్రసారం చేశాయి. ఇక ఈ ప్రసారాలను చుసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. జాతీయ బ్యాంకుల ముందు చెత్త వేయడం ఏంటని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనకు ఫోన్ చేసి సీరియస్ అయ్యారు. ఇక అనంతరం ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని ఆమెతో తెలిపాడు బుగ్గన. ఇక బుగ్గన చెప్పిన మాటలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది నిర్మలా సీతారామన్. మొత్తానికి బ్యాంకులపై వ్యవహరించిన తీరుపై దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ ఏపీలో ఇలాంటి ఘటనలు జరగడం కామనేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us