Health Tips : చేతికి అది పెట్టుకుంటే చాలు అవాంఛిత గర్భం రాదట
NQ Staff - March 23, 2023 / 06:10 PM IST

Health Tips : అవాంఛిత గర్భానికి ఇప్పటి వరకు పిల్స్, ఇంజక్షన్స్, కాపర్ టీ, కండోమ్స్ ఇలా రకరకాల సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇకపై మరింత సులువుగా అవాంఛిత గర్భ నిరోధక సాధనాన్ని వినియోగించవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు.
మోచేతికి పైన మూడు నుండి నాలుగు సెంటీమీటర్ల పొడవు రెండు నుండి నాలుగు మిల్లీమీటర్ల మందం ఉండే సూది లాంటి పరికరాన్ని చర్మం లోపట అమరుస్తారు. దీంట్లో గర్భ నిరోధ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయట.
నిజానికి ఈ సాధనం సంతానం సంతానం మధ్య దూరం కోరుకునే వారికి ఉపయోగపడుతుంది. దీనివల్ల భార్యాభర్తల ఆ సమయంలోని సఖ్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెప్తున్నారు. ఈ విధానాన్ని సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ గా పిలుస్తారు.
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉచితంగా ఈ గర్భ నిరోధ పరికరాన్ని పంపిణీ చేయాలని కేంద్ర నిర్ణయించింది. ఇక నుండి గర్భనిరోధక మాత్రలకు అనుమతించొద్దని కూడా కేంద్రం భావిస్తుందట. గర్భ నిరోధక మాత్రాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. అందుకే ఈ కొత్త పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చారు.