Akhanda : అన్ స్టాపబుల్ బాలకృష్ణ.. సెన్సార్ ను పూర్తి చేసుకున్న అఖండ..

Akhanda : నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుని ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక డిసెంబర్ 2 ఈ సినిమా రిలీజ్ కానున్న క్రమంలో లేటెస్ట్ గా మరో అప్డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అఖండ సినిమా కోసం U/A సర్టిఫికేట్ ను కన్ఫార్మ్ చేశారు. ఈ విషయాన్ని ద్వారకా క్రియేషన్స్ తన ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేసింది.

Censor formalities done for Unstoppable Akhanda
Censor formalities done for Unstoppable Akhanda

ఈ సినిమా రన్ టైమ్ రెండు గంటల 47 నిమిషాల డ్యూరేషన్ తో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ వార్తతో బాలయ్య బాబు అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటల్ని రిలీజ్ చేశారు. రీసెంట్ గా అఖండ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.

Censor formalities done for Unstoppable Akhanda
Censor formalities done for Unstoppable Akhanda

ఈ ట్రైలర్ లైక్స్, వ్యూస్ పరంగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో హై ఓల్టేజ్ పర్ఫార్మెన్స్ ని అందిస్తున్నారు. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఎస్ ఎస్ తమన్ అందిస్తున్నారు. థియేటర్ బాలకృష్ణ సినిమా చూడాలని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.