చంద్రబాబుకి కొండంత అండగా రంగంలోకి దిగిన ‘రెడ్డి’ గారు..!
Ajay G - December 26, 2020 / 07:46 PM IST

దీపక్ రెడ్డి తెలుసు కదా.. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి. తాజాగా ఆయన తాడిపత్రి ఘటనపై స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఉందా.. రౌడీల్లా ప్రవర్తించడం ఏంది.. అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పొలిటికల్ టెర్రరిజం అంటే ఏంటో ప్రభుత్వం చూపిస్తోంది. కేవలం టీడీపీని దెబ్బ తీయడం కోసం వైసీపీ పార్టీ చేయని అరాచకాలు లేవు. చంద్రబాబుపై కావాలని బురద జల్లుతున్నారు. టీడీపీ అడ్డు తొలగించుకొని విచ్చలవిడిగా దోపిడీ చేయాలన్న లక్ష్యంతో వైసీపీ నేతలు ఉన్నారని ఆయన దుయ్యబట్టారు.

cctv footage released by deepak reddy over tadipatri issue
వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి.. ప్రస్తుతం వైసీపీకి భజన చేయాలి… ఎదురుతిరిగితే అంతేనా ఇక. వైసీపీకి భజన చేయకపోతే ఇలా దౌర్జన్యం చేస్తారా? గత 40 ఏళ్ల నుంచి తాడిపత్రిలో జేసీ కుటుంబం హయాంలో అక్కడి ప్రజలు ఎంతో ప్రశాంతంగా బతుకుతున్నారు. కానీ.. నేడు తాడిపత్రిలో జరిగిన ఘటన ప్రతిఒక్కరిని కలిచివేస్తోంది. స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు.
తాడిపత్రి ఎమ్మెల్యే భార్య ఒక ఎద్దుబండి ఇసుకకు 10 వేల రూపాయలు వసూలు చేస్తున్నారంటూ.. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న విషయాలు బయటికి వచ్చాయి. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దానికి ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలి కానీ.. ఇలా నోటికొచ్చినట్టు వాగడం ఏంటి? అది నిజమైతే నిజమని.. లేకపోతే లేదని చెప్పాలి కానీ.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయితే ఇంత దురుసుగా ప్రవర్తిస్తాడా? దానికి జేసీ ఇంటికి వచ్చి దాడికి దిగడం ఏంటి.. అంటూ దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా దీపక్ రెడ్డి మీడియా ముందు ఉంచారు.