YS Vivekananda Reddy : వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్.. అవినాశ్ రెడ్డి అరెస్టు అయ్యే ఛాన్స్..?
NQ Staff - April 16, 2023 / 09:35 AM IST

YS Vivekananda Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కీలక మలుపు తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇంటికి ఉదయమే సీబీఐ అధికారులు చేరుకున్నారు.
కేసుకు సంబంధించి కీలక వివరాలను సేకరించారు. అనంతరం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే భాస్కర రెడ్డిపైన అనేక అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. రెండు సార్లు విచారణకు పిలిచింది. ఇప్పుడు అరెస్ట్ చేసింది.
అరెస్టుకు సంబంధించి వైఎస్ లక్ష్మికి సమాచారం ఇచ్చారు అధికారులు. భాస్కర్ రెడ్డి మీద సెక్షన్ 130బి,రెడ్ విత్ 302, 201 కేసు నమోదు చేశారు. ఇక హైదరాబాద్ లోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు, సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఏ క్షణం అయినా అవినాశ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఈ ఘటనతో ఏపీ రాజకీయాలు ఉలిక్కి పడ్డాయి. ఇది ఒక రకంగా వైసీపీకి చేదు అంశమే. సొంత ఇంటి వారినే సీబీఐ అదుపులోకి తీసుకోవడం జగన్ ను ఇరకాటంలో పడేసింది. ఇన్ని రోజులు తమ ఇంటి వారు కాదని వారించిన జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈ పరిణామాలపై జగన్ ఏమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి.