రియా తల్లిదండ్రులను విచారిస్తున్న సీబీఐ అధికారులు

Advertisement

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే పలురకాల అంశాలు బయటపడుతున్నాయి. ఈ కేసును సీబీఐ విచారిస్తుండగా ఈరోజు రియా యొక్క తల్లిదండ్రులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అలాగే రియా యొక్క తమ్ముడిని, సుశాంత్ స్నేహితుడైన సిద్దార్థ్ పితానిని కూడా విచారిస్తున్నారు. మొత్తం 3 రోజుల్లో ఇప్పటికే రియాను 34 గంటల పాటు విచారించారు.

ఇప్పుడు తాజాగా సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ విషయం బయటపడింది. సుశాంత్ కు క్లాస్ట్రోఫోబియా ఉందని, అందుకే ఆయన డ్రగ్స్ వాడుతుండే వాడని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో దాదాపు అందరు డ్రగ్స్ వాడుతున్నారని, తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. సుశాంత్ సింగ్ కేసులో చివరికి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here