ACB Searches : డ్రైనేజ్ పైప్స్‌లో నోట్ల క‌ట్ట‌లు… అవినీతి అధికారి బాగోతం

ACB Searches : కొంద‌రు అవినీతి అధికారులు దొంగ‌సొమ్ముని సంపాదించి దాని వ‌ల‌న లేని పోని స‌మ‌స్య‌లు ఎదుర్కొంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా కర్ణాటకలో విస్తృత సోదాలు నిర్వహించిన ఏసీబీ సిబ్బంది ఓ అవినీతి అధికారి ఇంటి డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు గుర్తించారు.

Cash Flows Out Of Drainage Pipe At Raid Spot As ACB Searches
Cash Flows Out Of Drainage Pipe At Raid Spot As ACB Searches

కర్ణాటకలో అవినీతి ప్రభుత్వ ఉద్యోగులకు షాకిస్తూ అనూహ్య దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఒకేసారి 60 చోట్ల విస్తృత సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో అక్రమ బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా కలబురగి పీడబ్ల్యూడీ జేఈ శాంతగౌడ ఇంట్లో తనిఖీ కోసం వెళ్లారు ఏసీబీ సిబ్బంది. అతని ఇంటి డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు ఉన్నట్లు గుర్తించారు.

ప్లంబర్​ను పిలిపించి పైపు కట్​ చేసి వాటిని బయటకు తీశారు. ఏసీబీ అధికారులను చూసి శాంతగౌడ తలుపులు 10 నిమిషాల పాటు తెరవలేదు . ఆ సమయంలోనే అతను డబ్బును డ్రైనేజీ పైపులో వేసి ఉంటాడని అధికారులు చెప్పారు. ఈ విషయం తెలిసే తాము పైపు కత్తిరించినట్లు వివరించారు. డ్రైనేజీ పైపు నుంచి రూ.13 లక్షలు వెలికితీసినట్లు వెల్లడించారు.

శాంతగౌడ ఇంట్లో మొత్తం రూ.54లక్షల అక్రమ నగదు, బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. రెండు లాకర్ల తాళంచెవులు ఇవ్వకుండా అధికారులను శాంతగౌడ ఇబ్బందిపెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గడగ్​ జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్​ టీఎస్ రుద్రేషప్పకు చెందిన శివమొగ్గ నివాసంలో రూ.3.5కోట్లు విలువ చేసే 7.5 కేజీల బంగారం సీజ్ చేశారు.

రూ.15లక్షల నదగు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంట్లో చేసిన సోదాల్లో 100 గ్రాముల గోల్డ్ బిస్కట్లు 60, 50 గ్రాములవి 8, కిలోన్నర ఆభరణాలు, డైమండ్ నెక్లెస్​, 3 కేజీల వెండిని అధికారులు గుర్తించారు.